Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

CEC DA to Ts govt employees

CEC permission Govt Employees DA : తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్‌న్యూస్‌ చెప్పింది.  ఉద్యోగులకు డీఏ చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అక్టోబర్ నెల నుంచి డీఏ చెల్లింపునకు అభ్యంతరం లేదని వెల్లడించింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో నెల రోజుల క్రితం డీఏ చెల్లింపులు చేేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఈసీని అనుమతి కోరింది. దీనిని పరిశీలించి డీఏ చెల్లింపుకు అనుమతి ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సమాచారం ఇచ్చింది.

కాగా.. డీఏకు అభ్యంతరం వ్యక్తం చేసిన సందర్భంలో ఈసీ డీఏల చెల్లింపు ఎందుకు ఆలస్యం అయిందని.. ఇప్పుడే ఎందుకు చెల్లిస్తున్నారని.. గతంలో ఎప్పుడెప్పుడు చెల్లించారు? అనే అంశాలపై ప్రభుత్వాన్ని ఈసీ ప్రశ్నించింది.

ఈ క్రమంలో ఎట్టకేలకు  పెండింగ్‌లో ఉన్న డీఏ విడుద‌ల‌ చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఉద్యోగులకు మూడు డీఏలు పెండింగ్‌లో ఉండగా.. ఒక డీఏ విడుదలకు ఈసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో ఉద్యోగులకు డీఏ విడుదలకు ఈసీ అనుమతి ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

Also Read: కాంగ్రెస్ నేతలవి లేకిబుద్ధులు, కర్ణాటక నేతలకు తెలంగాణలో ఏం పని?: దాసోజు శ్రవణ్