ఆపరేషన్ ఎయిర్ బెలూన్..! ప్రకాశం బ్యారేజ్‌లో బోట్లను వెలికితీసేందుకు శ్రమిస్తున్న అధికారులు

ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు.

Prakasam Barrage Stranded Boats : ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిలో చిక్కుకున్న బోట్లను వెలికి తీసేందుకు వైజాజ్ రంగంలోకి దిగింది. సీలైన్ ఆఫ్ షో డైవింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆధ్వర్యంలో ఈ బోట్లను వెలికితీసేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బెలూన్లు, అండర్ వాటర్ బ్రోకో కటింగ్ తో బోట్లను వెలికితీసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అనుకున్నంత సులువుగా బోట్ల తొలగింపు ప్రక్రియ జరగకపోవడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీ క్రేన్లతో బోట్లను తొలగించే ప్రయత్నం చేసినా బోట్లు కనీసం ఒక్క ఇంచు కూడా కదల్లేదు.

అధికారులు గంటల పాటు తీవ్రంగా శ్రమించినా బోట్లు ఇంచు కూడా కదలకపోవడంతో అండర్ వాటర్ బ్రోకో కటింగ్, బెలూన్ల సాయంతో బోట్లను తొలగించనున్నారు. ఒక్కొక్కటి 50 టన్నుల బరువును లేపే సామర్థ్యం ఉన్న రెండు భారీ క్రేన్లను ఉపయోగించినా.. బోట్లు అక్కడి నుంచి కదల్లేదు. బోట్ల బరువు 20 టన్నులపైనే ఉండటం, బోట్లు ఒకదానితో మరొకటి చిక్కుకుని ఉండటం, ఇసుకతో నిండి ఉండటం వల్ల ఒత్తిడి కారణంగా బోట్లు కదల్లేని పరిస్థితుల్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.

 

Also Read : ఆపరేషన్ కొల్లేరు..! సీఎం చంద్రబాబు అంత పెద్ద సాహసం చేయగలరా?

ట్రెండింగ్ వార్తలు