Omicron Tension : శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్..దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కోవిడ్ పాజిటివ్

కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడటంతో భారత్ కలవర పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది.

Covid positive for a person from South Africa : కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ఇప్పటికే అనేక దేశాల్లో ఒమిక్రాన్ కేసులు బయటపడిన నేపథ్యంలో భారత్ కలవర పడుతోంది. శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ టెన్షన్ నెలకొంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ గా తేలింది. బాధితుడు ఇటీవలే విదేశాల నుంచి వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. అతన్ని శ్రీకాకుళం రిమ్స్ కు తరలించిన అధికారులు..ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు.

అతనికి లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ ను రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ జిల్లాలో వచ్చిందనే టెన్షన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు సమాచారం అందుతోంది.

Ravikumar Comments : ఏపీ జేఏసీ నేతలపై ట్రెజరీ ఉద్యోగుల సంఘం నేత రవికుమార్ సంచలన వాఖ్యలు

అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. మళ్లీ ఆయన అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిన నేపథ్యంలో అతని శాంపిల్స్ సేకరించి ల్యాబ్స్ కు పంపిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కు సంబంధించిన టెస్టులు నిర్వహిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు