Ap And Telangana
AP and Telangana: పలు అంశాలపై తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు నెలకొన్నాయి. వీటిని సర్దిజెప్పేందుకు పూనుకుంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. జనవరి 12న సమావేశాన్ని నిర్వహించాలని ప్లాన్ చేసి ప్రముఖులు హాజరుకావాలంటూ లేఖ ద్వారా తెలియజేశారు.
కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష సమావేశాన్ని రద్దు చేసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించాలని మరో లేఖలో వెల్లడించారు. సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరుకావాలని చెప్పింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.
విభజన సమస్యలు, ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న వివాదాలపై జనవరి 12న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో జరిగే సమావేశం జరగాల్సి ఉంది.
ఇది కూడా చదవండి: ఒమిక్రాన్ విశ్వరూపం.. తమిళనాడులో లాక్‌డౌన్!