Palnadu Road Accident : ఆగివున్న లారీని ఢీకొట్టిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఒకరు మృతి, మరో 15 మందికి గాయాలు

బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

Road Accident (3) (1)

Road Accident One died : పల్నాడు జిల్లా దాచేపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ప్రైవేట్ ట్రావెల్స్ ఢీకొట్టడంతో ఒకరు మృతి చెందారు. ఆగివున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో దాచేపల్లి జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నాడని తెలుస్తోంది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కందుకూరు నుంచి ఒంగోలు వెళ్తోంది.

West Bengal Bus Accident : ఒడిశా రైలు ప్రమాద క్షతగాత్రులను తరలిస్తుండగా.. బస్సు ప్రమాదంలో మళ్లీ గాయాలు

క్షతగాత్రులను చికిత్స కోసం గురజాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మరో పది మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. అతివేగంతో వచ్చిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడివారిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.