AgriGold : అగ్రిగోల్డ్ బాధితులకు ప్రభుత్వం మరో రోజు అవకాశం

అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది.

Agrigold

AgriGold : అగ్రిగోల్డ్ డిపాజిటర్ల దరఖాస్తు నమోదు గడువును ఏపీ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 19 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చంది. రూ.20వేల లోపు డిపాజిట్ దారుల వివరాలు సరి చూసేందుకు మరో అవకాశం ఇచ్చింది. వాలంటీర్ల దగ్గర రసీదులతో వివరాలు నమోదు చేయాలన్న ప్రభుత్వం.. ఎంపీడీవో కార్యాలయాల్లో రసీదులు ఇవ్వొచ్చంది. కాగా, ఈ నెల 24న రూ.20వేల లోపు డిపాజిట్లు చేసిన వారి అకౌంట్లలో ప్రభుత్వం డబ్బులు జమ చేయనుంది. ఈ నెల 6న మొదలైన వివరాల నమోదు ప్రక్రియ గురువారం(ఆగస్టు 18,2021) వరకు కొనసాగుతుంది.

అగ్రిగోల్డ్‌ బాధితుల నుంచి వినతులు రావడంతో అధికారులు సానుకూలంగా స్పందించారు. డిపాజిట్‌దారులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు గడువు పొడిగించారు. రూ.20వేల లోపు అగ్రిగోల్డ్ డిపాజిట్‌దారులు agrigolddata.in వెబ్‌సైట్‌లో ఆధార్ నమోదుతో పూర్తి వివరాలును చూడవచ్చు. ఒక వేళ వివరాలను మార్పు చేయాల్సి వస్తే ఎంపీడీవో ఆఫీస్‌ ద్వారా సరిచేసుకునే అవకాశం కల్పించారు. ఏవైనా సందేహాలుంటే టోల్‌ ఫ్రీ నంబర్ 1800-4253875 సంప్రదించాలని సూచించారు.

ఏపీ ప్రభుత్వం రూ.20 వేలలోపు డిపాజిట్‌దారులను ఆదుకోవాలని నిర్ణయించింది. ఈ నెల 24న సీఎం వైఎస్‌ జగన్‌ ఆ డిపాజిట్‌ దారుల బ్యాంకు ఖాతాల్లో ఆ మొత్తాలను జమ చేయనున్నారు. అగ్రి గోల్డ్‌ సంస్థలో రూ.10 వేల నుంచి రూ.20 వేలలోపు కట్టిన డిపాజిట్‌దారులు సంబంధిత చెక్కు, పే ఆర్డర్, రశీదులు, బ్యాంక్‌ పాస్‌ పుస్తకం, ఆధార్‌ కార్డు వివరాలను తమ గ్రామ/వార్డు వలంటీర్‌ దగ్గర నమోదు చేయించుకోవాలని సీఐడీ కోరింది.

అగ్రిగోల్డ్ బాధితులు సంబంధిత వివరాలను గ్రామ/వార్డు వాలంటీర్‌ ద్వారా నమోదు చేయించుకోవాలి. కోర్టు తెలిపిన జాబితా ప్రకారం చెల్లింపులు జరుగుతాయి. డిపాజిట్‌దారులకు రావాల్సిన నగదును వారి బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు. ఇతరుల బ్యాంకు అకౌంట్లను సమ్మతించరు.. ఒక డిపాజిట్‌దారు ఒక క్లెయిమ్‌కే అర్హులు. చనిపోయిన డిపాజిట్‌దారుల డిపాజిట్‌ మొత్తాలను వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. కాబట్టి వారు లీగల్‌ హైర్‌ సర్టిఫికెట్‌ కూడా సమర్పించాలి. గతంలో రూ.10 వేల లోపు క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు. ఒక్కసారి కూడా నగదు పొందని వారే ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవాలి.

అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. రూ.10వేల వరకు ఉన్న డిపాజిట్లను బాధితులకు అందజేసినట్టు తెలిపింది. ప్రస్తుతం రూ.10వేల నుంచి రూ.20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్‌ డిపాజిట్‌ దారులకు వారి బ్యాంకు ఖాతాలో ఈనెల 24న సీఎం చేతుల మీదుగా జమ చేస్తారని వెల్లడించింది.
* అర్హులైన బాధితులు.. డిపాజిట్లకు సంబంధించిన ఒరిజినల్‌ పత్రాలు, చెక్కు, పే ఆర్డర్‌, రశీదులు, బ్యాంకు పాస్‌బుక్‌, ఆధార్‌ కార్డులను సంబంధిత గ్రామ, వార్డు సచివాలయాల్లో సమర్పించాలి.
* ఎవరైనా డిపాజిట్‌ దారుడు మరణిస్తే లీగల్‌ హెయిర్‌ సర్టిఫికెట్‌ చూపాలి. నగదును వారి చట్టబద్ధ సంబంధికుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు.
* ఒక డిపాజిట్‌ దారుడు ఒక క్లెయిమ్‌కు మాత్రమే అర్హుడు.
* గతంలో రూ.10వేల లోపు డిపాజిట్‌ క్లెయిమ్‌ పొందిన వారు ప్రస్తుతం అనర్హులు.
* బాధితుల సమస్యల పరిష్కారానికి 1800 4253 875 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు.

అధికారంలోకి రాగానే అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని సీఎం జగన్‌ పాదయాత్ర సమయంలో హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు చేపట్టారు. ఇప్పటివరకు పలు విడుతల్లో చెల్లింపులు చేశారు.