Breaking : ఏపీలో తొలి ఒమిక్రాన్ కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Breaking

Breaking : ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ధృవీకరించంది. విజయనగరం జిల్లాకు చెందిన ఓ వ్యక్తిలో ఈ వేరియంట్ గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఐర్లాండ్ నుంచి ముంబై వచ్చిన ప్రయాణికుడికి ముంబైలో టెస్టు చేయగా కోవిడ్ నెగటివ్ వచ్చింది. దీంతో అతడు స్వగ్రామం వెళ్లారు. విజయనగరంలో మరోసారి పరీక్ష చేయగా ఒమిక్రాన్ సోకినట్లు నిర్దారణ అయింది.

చదవండి : Corona Cases : దేశంలో 7,774 కరోనా కేసులు.. రాష్ట్రాలకు లేఖలు రాసిన కేంద్ర ఆరోగ్యశాఖ

దీంతో స్థానికంగా ఆందోళన మొదలైంది. వెంటనే అలెర్ట్ అయిన అధికారులు ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అతడిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు చేయనున్నారు అధికారులు. ఎవరు ఆందోళన చెందవద్దని వైద్యారోగ్యశాఖ అధికారులు సూచించారు. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు. కొత్తగా నమోదైన కేసుతో దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 34కి చేరింది. వీరిలో మహారాష్ట్రలోని పదిమంది వరకు ఉన్నారు.

చదవండి : Corona In Telangana : తెలంగాణలో కొత్తగా 188 కరోనా కేసులు, ఒకరు మృతి