ఏపీ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది : చప్పట్లతో సీఎం జగన్ సంఘీభావం

  • Publish Date - October 2, 2020 / 07:24 PM IST

AP Village volunteer system : ఏపీలో గ్రామ సచిలవాలయ వాలంటీర్ల వ్యవస్థకు ఏడాది పూర్తి అయింది. వాలంటీర్ల కృషికి చప్పట్లతో అభినిందించాలని రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. వాలంటీర్ల సేవలను అభినందిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా చప్పట్లు కొట్టారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లకు సీఎం జగన్ చప్పట్లు కొట్టి సంఘీభావాన్ని తెలిపారు.



తాడేపల్లిలోని తన నివాసంలో శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లు కొట్టి జగన్ సంఘీభావాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు అధికారులు పాల్గొన్నారు.



గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ఆవిష్కృతమై సరిగ్గా నేటికి ఏడాది. గత ఏడాది అక్టోబర్‌ 2న సచివాలయ వ్యవస్థకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టారు. సెక్రటరీల నియామకం చేపట్టే ఈ వ్యవస్థను జనవరి 26న పూర్తి స్థాయిలో సీఎం ప్రారంభించారు. ఏపీలో వాలంటీర్ల సేవతో ప్రభుత్వ సేవలన్నీ గ్రామాలు, వార్డుల్లోనే పొందేలా వెసులుబాటు వచ్చింది.