నేను జనసేనలోకి వెళ్తుండడంతో టీడీపీ ఎమ్మెల్యే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని

తాను ఈ నెల 26న జనసేనలోకి వెళ్తుండటంతో ఎమ్మెల్యే జనార్ధన్ తనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు.

టీడీపీ ఎమ్మెల్యే జనార్ధన్ తనపై చేసిన ఆరోపణలను ఖండిస్తున్నానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ఒంగోలుకు చేరుకున్న బాలినేని ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడుతూ… ఆ ఆరోపణలపై తాను ఎప్పుడో సీఎం చంద్రబాబు నాయుడికి లేఖ రాశానని తెలిపారు.

తాను ఈ నెల 26న జనసేనలోకి వెళ్తుండటంతో ఎమ్మెల్యే జనార్ధన్ తనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని చెప్పారు. తనపై విచారణ చేయించుకోవాలని ఎప్పుడో చెప్పానని తెలిపారు. ఒంగోలులో జరుగుతున్న పరిణామాలను పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకువెళతానని అన్నారు.

కాగా, బాలినేని జనసేన పార్టీలో చేరుతుండడంతో ఈ వ్యవహారంపై ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ స్పందిస్తూ… వైసీపీ పాలన సమయంలో టీడీపీ కార్యకర్తలను బాలినేని ఇబ్బందులకు గురిచేశారని అన్న విషయం తెలిసిందే. టీడీపీ నేతలు, కార్యకర్తలపై బాలినేని అక్రమంగా కేసులు పెట్టించారని, తనపై కూడా 32 కేసులు పెట్టించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు.

మరి అప్పుడు ఎందుకు ఫిర్యాదు చేయలేదు?: శ్రీవారి లడ్డూపై రోజా నిలదీత