Sarva Darshan Tokens
Sarva Darshan Tickets: జనవరి నెలకు సంబంధించిన సర్వదర్శనం టికెట్లను ఈరోజు(27 డిసెంబర్ 2021) ఉదయం 9 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేసింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనాన్ని పురస్కరించుకొని.. జనవరి 13 నుంచి 22 వరకు రోజుకు 5వేల చొప్పున టికెట్లు విడుదల చేసింది. మిగిలిన రోజుల్లో రోజుకు 10 వేల చొప్పున టోకెన్లు విడుదల చేసినట్లు టీటీడీ.
జనవరి నెలకు సంబంధించి శ్రీవారి ప్రత్యేక దర్శనం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో ఇప్పటికే విడుదల చేయగా కేవలం గంట వ్యవధిలోనే టికెట్లు అమ్ముడయ్యాయి. జనవరి నెలకు గాను మొత్తం 4లక్షల 60 వేల టికెట్లను విడుదల చేయగా 60 నిమిషాల్లో భక్తులు టికెట్లను కొనుగోలు చేశారు.
ఇక, దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు కోవిడ్ నెగెటివ్ లేదా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది టీటీడీ. రెండు డోసుల వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ తప్పనిసరిగా తీసుకురావాలని భక్తులకు సూచించింది.
ఒకవేళ వ్యాక్సిన్ ఇంకా వేయించుకోకపోతే దర్శనానికి 48 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష నెగెటివ్ సర్టిఫికెట్ తీసుకురావాలని భక్తులకు స్పష్టం చేసింది టీటీడీ.