రైతునేస్తానికి పట్టం : యడ్లపల్లి వెంకటేశ్వరరావుకు పద్మశ్రీ
వ్యవసాయమే ఆయన శ్వాస. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడి ఆయన లక్ష్యం. ఆయనే రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు. యడ్లపల్లి పద్మశ్రీ

వ్యవసాయమే ఆయన శ్వాస. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడి ఆయన లక్ష్యం. ఆయనే రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు. యడ్లపల్లి పద్మశ్రీ
వ్యవసాయమే ఆయన శ్వాస. ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడి ఆయన లక్ష్యం. ఆయనే రైతునేస్తం ఫౌండేషన్ వ్యవస్థాపకులు యడ్లపల్లి వెంకటేశ్వరరావు. యడ్లపల్లి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. రసాయనిక ఎరువుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ పద్ధతుల ద్వారా ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తుల దిగుబడికి ఆయన చేస్తున్న నిరంతర కృషికి గుర్తింపుగా ఈ పురస్కారం లభించింది.
యడ్లపల్లి ‘రైతునేస్తం వెంకటేశ్వరరావు’గా తెలుగు రాష్ట్రాల రైతాంగానికి సుపరిచితులు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం కొర్నేపాడులో 1968లో జన్మించారు. రైతు కుటుంబంలో పుట్టి, వ్యవసాయం చేస్తూ పెరిగిన వెంకటేశ్వరరావు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. రైతునేస్తం ఫౌండేషన్ స్థాపించి, 12 ఏళ్లుగా ఆదే పేరుతో వ్యవసాయ మాసపత్రిక నడుపుతున్నారు. ఈ క్రమంలో పశునేస్తం, ప్రకృతినేస్తం పత్రికలు ప్రారంభించి రైతులకు చేరువయ్యారు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త పద్మశ్రీ డా.ఐవీ సుబ్బారావు పేరుతో వ్యవసాయ విద్య, పరిశోధన, విస్తరణ రంగాలలో విశేష ప్రతిభ కనబరచిన శాస్త్రవేత్తలు, అధికారులు, రైతులు, వ్యవసాయ విలేకరులను ఏటా రైతునేస్తం పురస్కారాలతో గౌరవిస్తున్నారు.
కొంతకాలంగా రైతునేస్తం ఫౌండేషన్ ద్వారా ప్రతి ఆదివారం కొర్నేపాడులో రసాయన రహిత సేద్యం, మిద్దెతోట, చిరుధాన్యాల సాగు ఆవశ్యకత, సేంద్రియ ఉత్పత్తుల అవసరం.. తదితర అనేక అంశాలపై శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఉభయ రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాలలో అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. వీటికి తోడు పలు గ్రామాభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు.