ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌!

Palla srinivas: అచ్చెన్నాయుడికి మంత్రి పదవి దక్కడంతో పల్లా శ్రీనివాస్‌ను ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవిలో నియమించే అవకాశం ఉంది.

Palla Srinivasa Rao: ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్‌కు అవకాశం దక్కింది. ఇప్పటివరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఉన్న విషయం తెలిసిందే. ఆయనకు మంత్రి పదవి దక్కడంతో పల్లా శ్రీనివాస్ ను ఏపీ టీడీపీ అధ్యక్షుడి పదవిలో నియమించనున్నట్లు తెలుస్తోంది.

బీసీ యాదవ వర్గానికి చెందిన పల్లా శ్రీనివాస్.. గాజువాక ఎమ్మెల్యేగా ఏపీలోనే అత్యధిక మెజార్టీతో ఎన్నికైన విషయం తెలిసిందే. టీడీపీ నుంచి పోటీ చేసి 95,235 ఓట్లతో గాజువాక ఎమ్మెల్యేగా పల్లా శ్రీనివాస్ గెలిచారు. మాజీ మంత్రి అమర్‌నాథ్ ను పల్లా శ్రీనివాస్ ఓడించారు.

Cinematography Minister : జనసేనకే సినిమా శాఖ.. ఏపీ కొత్త సినిమాటోగ్రఫీ మినిష్టర్ ఎవరంటే..?

టీడీపీ ఏపీ అధ్యక్షుడిగా కొందరు నేతల పేర్లను చంద్రబాబు నాయుడు పరిశీలించారు. చివరకు పల్లా శ్రీనివాస్ పైనే ఆయన మొగ్గు చూపుతున్నారు. ప్రజా ఉద్యమాల్లోనూ పల్లా శ్రీనివాస్ ముందున్నారు. పల్లా శ్రీనివాసరావు తండ్రి టీడీపీలోనే ఉండేవారు. టీడీపీ నుంచి పల్లా శ్రీనివాస్ రావు 2014లో గాజువాక ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో అమర్ నాథ్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిచారు.