Chandrababu On Palnadu Murders : పల్నాడులో హత్యల వెనుక ఎమ్మెల్యే హస్తం-చంద్రబాబు సంచలన ఆరోపణలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు.(Chandrababu On Palnadu Murders)

Chandrababu On Palnadu Murders : వైసీపీ నేతలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫైర్ అయ్యారు. పల్నాడులో జరిగిన హత్యల వెనుక మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక్క మాచర్లలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు. జల్లయ్య అంత్యక్రియలకు వెళ్తున్న తెలుగుదేశం నేతలను అరెస్ట్ చేయడంపై చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని ఎక్కడికి తరలించారు అన్నది కుటుంబసభ్యులకు కూడా చెప్పరా? అంటూ ప్రశ్నించారు. సొంత గ్రామంలో అంత్యక్రియలకు అనుమతి ఇవ్వరా? అంటూ మండిపడ్డారు చంద్రబాబు.

టీడీపీ కార్యకర్త జల్లయ్య దారుణ హత్య కలకలం రేపింది. జల్లయ్య హత్యపై పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. ఒక్క మాచర్ల నియోజకవర్గంలోనే ఐదుగురు బీసీలను హత్య చేశారని, ఆ హత్యల వెనుక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆయన ఆరోపించారు. ప్రత్యేక కోర్టులో విచారణ జరిపించి హత్యలు చేసిన వారికి ఉరిశిక్ష వేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

జల్లయ్య అంత్యక్రియలు, ఆయన కుటుంబ సభ్యుల పరామర్శ కోసం వెళుతున్న టీడీపీ నేతలను అడ్డుకోవడం, అరెస్ట్ చేయడం పట్ల చంద్రబాబు మండిపడ్డారు. ప్రాణాలను కాపాడలేని పోలీసులు.. తమ నేతలను అడ్డుకోవడమేంటని నిలదీశారు. జల్లయ్య మృతదేహాన్ని ఎక్కడకు తీసుకెళ్లారో కూడా చెప్పలేదని మండిపడ్డారు. సొంత గ్రామంలో అంత్యక్రియలు చేసుకునే అవకాశం కూడా ఇవ్వరా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.(Chandrababu On Palnadu Murders)

Andhra Pradesh : పల్నాడులో ఫ్యాక్షన్ హత్య-ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త మృతి

పల్నాడు జిల్లా జంగమహేశ్వరపాడులో ప్రత్యర్థుల దాడిలో టీడీపీ కార్యకర్త జల్లయ్య మరణించారు. జల్లయ్య కుటుంబానికి తెలుగు దేశం పార్టీ అండగా నిలబడింది. జల్లయ్య కుటుంబానికి టీడీపీ తరఫున రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటిస్తున్నట్లు పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. జల్లయ్యను హత్య చేసిన నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.

ఇదిలా ఉంటే పోస్టుమార్టం త‌ర్వాత‌ జ‌ల్ల‌య్య మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు అప్ప‌గించే విష‌యంలో హైడ్రామా నెల‌కొంది. మృత‌దేహాన్ని కుటుంబ స‌భ్యుల‌కు కాకుండా వారి బంధువుల‌కు అప్ప‌గించేందుకు పోలీసులు య‌త్నించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

టీడీపీ కార్యకర్త జల్లయ్యను ప్రత్యర్థులు శుక్రవారం హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ హత్యపై టీడీపీ నాయకులు భగ్గుమన్నారు. జగన్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న సీఎం జగన్ ని ఏమనాలంటూ నిలదీశారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు.

కార్యకర్తలు, అనుచరులతో కలిసి జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు బయల్దేరిన మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నను పోలీసులు ఆయన ఇంటి వద్దే అడ్డుకున్నారు. దీంతో ఆయన ఇంటి ముందు బైఠాయించి నిరసన తెలిపారు.

Andhra pradesh : ఏపీలో రౌడీ రాజ్యం..హత్యలు చేయమని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు : బుద్దా వెంకన్న

రాష్ట్రంలో రౌడీ రాజ్యం నడుస్తోందని ఫైర్ అయ్యారు బుద్ధా వెంకన్న. సీఎం జగన్.. హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారంటూ మండిపడ్డారు. పల్నాడులో బీసీ వర్గానికి చెందిన ముగ్గురు నేతలను చంపేశారని, ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జల్లయ్య మృతదేహానికి నివాళులు కూడా అర్పించకూడదా? అని ప్రశ్నించారు.

కుటుంబ సభ్యుల సంతకం లేకుండానే జల్లయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం ఎలా చేస్తారంటూ నిలదీశారు. ఇలా చేయించడం రాజారెడ్డి రాజ్యాంగంలోనే చెల్లిందంటూ విమర్శించారు. బీసీ నేతల హత్యల్లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన కుట్రదారుడని బుద్ధా వెంకన్న ఆరోపించారు.(Chandrababu On Palnadu Murders)

పల్నాడులో మరోసారి ఫ్యాక్షన్ భూతం పురి విప్పింది. ప్రత్యర్ధుల దాడిలో టీడీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య ఆ గ్రామాన్ని విడిచిపెట్టి మూడేళ్లుగా మాడుగుల గ్రామంలో ఉంటున్నాడు. దుర్గిలోని బ్యాంకుకి వెళ్లటానికి గ్రామానికి చేరుకున్నాడు. దుర్గి బ్యాంకుకి వెళుతుండగా దారి కాచిన ప్రత్యర్ధులు వేట కొడవళ్లు, కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన జల్లయ్యను మొదట మాచర్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ జల్లయ్య మరణించాడు. ఈ ఘటనలో ఎల్లయ్య, బక్కయ్య అనే మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. పాత కక్షలే దాడికి కారణమని పోలీసులు తెలిపారు. గ్రామంలో ఎటువంటి ఘర్షణలు తలెత్తకుండా పోలీసులను మోహరించారు.

ట్రెండింగ్ వార్తలు