Andhra pradesh : ఏపీలో రౌడీ రాజ్యం..హత్యలు చేయమని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు : బుద్దా వెంకన్న

ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది..సీఎం జగన్ హత్యలు చేయమని తమ నేతలను ప్రోత్సహిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఆరోపించారు.పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో బుద్ధా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Andhra pradesh : ఏపీలో రౌడీ రాజ్యం..హత్యలు చేయమని సీఎం జగన్ ప్రోత్సహిస్తున్నారు : బుద్దా వెంకన్న

Police Obstructs Tdp Leaders While They Heading To Palnadu Districts..

Andhra pradesh :  ఏపీలో రౌడీ రాజ్యం నడుస్తోంది..సీఎం జగన్ హత్యలు చేయమని తమ నేతలను ప్రోత్సహిస్తున్నారు అంటూ మాజీ ఎమ్మెల్యే బుద్ధా వెంకన్న ఆరోపించారు.పల్నాడులో టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య హత్య జరిగిన విషయం తెలిసిందే. ఈక్రమంలో జల్లయ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న క్రమంలో బుద్ధా వెంకన్నను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా బుద్దా వెంకన్న మీడియాతో మాట్లాడుతూ..తమ పార్టీ కార్యకర్త హత్యకు గురి కాగా వారి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళుతున్న తమ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని కష్టంలోఉన్నవారిని ఓదార్చేందుకు..వారికి తమ పార్టీ అండగా ఉంటుందని చెప్పటానికి వెళుతుంటే ఈ అక్రమ అరెస్టులు ఏంటీ అంటూ బుద్దా మండిపడ్డారు. ఏపీలో రౌడీ రాజ్యాన్ని సీఎం జగనే స్వయంగా ప్రోత్సహిస్తున్నారంటూ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్నాడులు ముగ్గురు టీడీపీ కార్యకర్తలు హత్యలకు గురి అయ్యారని ఈ మూడు హత్యల వెనుక వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్ని రామకృష్ణారెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. అంతేకాకుండా ఇటువంటి ఘాతుకాలకు పాల్పడుతున్న పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బహిరంగంగా ఎన్ కౌంటర్ చేయాలని అన్నారు. డీజీపీగా గౌతమ్ సవాంగ్ ను మూడేళ్లు ఇష్టానుసారంగా వాడుకుని సాగనంపేసారని రేపు ప్రస్తుత డీజీపి పరిస్థితి కూడా అదేనంటూ ఎద్దేవా చేశారు.

Also read : Uttar Pradesh Violence: యూపీలో హింస్మాత‌క ఘ‌ట‌న కేసు.. 36 మంది అరెస్టు

కాగా..పల్నాడు వెళ్లేందుకు టీడీపీ నేతలు యత్నిస్తున్న క్రమంలో పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడిక్కడ అడ్డుకుంటున్నారు..హౌస్ అరెస్టులు చేస్తున్నారు. నేడు జంగమేశ్వరపాడులో హత్యకు గురి అయిన టీడీపీ కార్యకర్త కంచర్ల జల్లయ్య అంత్యక్రియలు జరుగనున్నాయి. ఈ కార్యక్రమానికి పాల్గొనేందుకు టీడీపీ నేతల పయనమవ్వగా పోలీసులు వారిని గృహనిర్బంధం చేస్తున్నారు. పోలీసులు తీరుపై టీడీపీ నేత నక్కా ఆనందబాబు తీవ్రంగా మండిపడ్డారు.

విజయవాడలో బుద్ధా వెంకన్నను, తేలుకుంట్లలో యరపతినేని శ్రీనివాసరావును, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డిని గృహనిర్బంధం చేశారు. పొందుగుల వద్ద కొల్లు రవీంద్ర, ప్రత్తిపాటి పుల్లారావు, జీవీ ఆంజనేయులను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అటు సంతమాగులూరు వద్ద బీదా రవిచంద్రను అడ్డుకున్న పోలీసులు వినుకొండ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Also read : Clashes in Kanpur: బీజేపీ మహిళా నేత వ్యాఖ్యలపై నిరసన: కాన్పూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

దీనిపై నక్కా ఆనందబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ కారణంతో తనను ఆపుతున్నారో సమాధానం చెప్పాలని పోలీసులను డిమాండ్ చేశారు.తనను అక్రమంగా నిర్బంధిస్తే కోర్టులో పిటిషిన్ వేస్తానని హెచ్చరించారు. వైసీపీ నేతలు చెప్పినట్టల్లా ఆడితే పోలీసులే ఇబ్బందిపడతారని స్పష్టం చేశారు. పట్టపగలే హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏంచేస్తున్నారని ఆనందబాబు ప్రశ్నించారు. పరామర్శకు వెళుతుంటే పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పల్నాడు వెళ్లితీరతామని అన్నారు.