Don 3 : ఒకే మూవీలో ఆ ముగ్గరు..?
రణ్‌వీర్ సింగ్, అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్.. ఈ ముగ్గురు కూడా ఒకే మూవీ(Don 3 )లో కనిపించబోతున్నారట.

Don 3 Amitabh Bachchan Shah Rukh Khan To Join Ranveer Singh
Don 3 : డాన్ ఫ్రాంఛైజీలో వస్తున్న డాన్-3 సినిమాపై ఆడియన్స్‌లో ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోతున్నాయి. డాన్-3లో బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్ కీలక పాత్రలో నటించబోతున్నట్లు అనౌన్స్ చేశారు. బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ కూడా డాన్-3(Don 3)లో యాక్ట్ చేస్తారని అంటున్నారు. ఆయన తొలిసారి 1978లో డాన్‌గా ప్రేక్షకుల్ని అలరించారు. ఆ తర్వాత డాన్ ఫ్రాంచైజీలు చేసిన షారుక్ ఖాన్ కూడా డాన్-3లో స్పెషల్ రోల్‌లోనటించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
ఇప్పుడు ఈ ఇద్దరు పాత డాన్‌లు రణ్‌వీర్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నట్లు బాలీవుడ్‌లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. డాన్-3 సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం కానుంది. 2026 డిసెంబరులో విడుదల చేయడమే మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారట. దీనికి ఫర్హాన్ అక్తర్ డైరెక్టర్‌గా కాగా..ఈ ముగ్గురు లెజెండరీ స్టార్లు ఒకే తెరపై కనిపిస్తే మాత్రం బాలీవుడ్ హిస్టరీలో డాన్-3 బిగ్ సెన్సేషన్‌గా నిలవడం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.
Bigg Boss Telugu 9 : బిస్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టనున్న ఆరుగురు కామన్ మ్యాన్స్.. లిస్ట్ ఇదే?
రణ్‌వీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఇప్పటికే ఫిజికల్ ట్రైనింగ్‌తో పాటు మార్షల్ ఆర్ట్స్ స్పెషల్ శిక్షణ తీసుకుంటున్నాడట. ఈ సినిమా గత డాన్ చిత్రాలతో పోలిస్తే మరింత యాక్షన్, స్టైల్, భారీ స్కేల్‌లో రాబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలా డాన్-3 చుట్టూ గాసిప్‌లు ఆగడం లేదు. మొదట కియారా అద్వానీ ఫీమేల్ లీడ్‌గా ఎంపికైనప్పటికీ, ఆమె ప్రెగ్నెంట్ కావడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఆమె ప్లేస్‌లో కృతి సనన్ రాబోతుందని, ఆమె ఇప్పటికే యాక్షన్ సీన్స్ కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి.
Madharaasi Twitter Review : శివకార్తికేయన్ ‘మదరాసి’ ట్విటర్ రివ్యూ..
అలాగే విక్రాంత్ మాస్సీ విలన్ పాత్ర నుంచి తప్పుకోవడంతో, కరణ్ వీర్ మెహ్రాను తీసుకునే ఛాన్స్ ఉందట. ఇంకా 2006 డాన్‌లోని ఆజ్ కీ రాత్ సాంగ్‌ను గుర్తు చేసేలా రణవీర్, కృతితో ఒక హైఎనర్జీ ట్రాక్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయితే క్యాస్ట్ అండ్ క్రూపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇది భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది.