Paritala Sreeram: పరిటాల రవి పేరు ఎక్కువగా తలచుకుంటున్నావు.. ధన్యవాదాలు..

ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు ధన్యవాదాలు.

Paritala Sreeram: ధర్మవరంలో పరిటాల శ్రీరామ్, కేతిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిపై మరోసారి టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలను కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత కేతిరెడ్డిపై ఉందన్నారు. తనకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పిన కేతిరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

ప్రెస్ మీట్ లో పరిటాల శ్రీరామ్(Paritala Sreeram) ఏమన్నారంటే.. ‘ధర్మవరంలో భూములు కబ్జా చేస్తున్న నేతలంతా ఎమ్మెల్యే కేతిరెడ్డి చుట్టూ ఉన్నారు. ఎర్రగుట్ట వద్ద ఎమ్మెల్యే కేతిరెడ్డి స్థలం పక్కన ఉన్న స్థలం మేడాపురం సూరిది. ఆయన ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రధాన అనుచరుడు. కేతిరెడ్డే నిజాలు చెబుతున్నారు. పైగా బుకాయిస్తూ అక్రమాలు చేస్తే చెప్పుతో కొట్టండి అని అంటున్నారు. నీ అనుచరులను నువ్వే కొట్టకపోతే ఇంకెవరు కొడతారు?

లోకేశ్ పాదయాత్రలో జగన్(YS Jagan) లా ముద్దులు పెడుతూ.. బుగ్గలు నిమరలేదు ఆయన ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఫోటోలకు ఫోజులిచ్చి నటించడం లోకేశ్ (Nara Lokesh) కు రాదు. గతంలో ఏ సీఎం హయాంలో కూడా రైతులు ఇంత ఇబ్బంది పడలేదు. మనం నడిచే విధానం, మాట్లాడే వాటి గురించి చాలా మంది మన వెనుక మాట్లాడుతారు. మనం ఒకరిని అనేముందు మనమేం చేస్తున్నాం అనేది చూసుకోవాలి.

Also Read: గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్

కాశిరెడ్డి నాయన ఆశ్రమం వంటి గొప్ప క్షేత్రాలను కామెడీ కోసం వాడుతున్నారు. మేము పరిటాల రవి (Paritala Ravi) ఆశ్రమాలు నడుపుతున్నాం. కష్టం వచ్చిన వారికి సాయంగా ఉంటున్నాం. వేల మందికి రక్తదానం చేశాం. వందల సంఖ్యలో రవి పేరుతో వాటర్ ప్లాంట్లు నడుపుతున్నాం. బలహీన వర్గాలకి, బలమైన వర్గాలకి జరిగిన పోరాటంలో పరిటాల రవి ప్రాణాలు కోల్పోయారు. తనను రెడ్డి సామాజిక వర్గానికి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని.. పరిటాల రవే స్వయంగా చెప్పారు. అనంతపురం, రాప్తాడులో ఎక్కడ, ఏ అక్రమం జరిగినా తోపుదుర్తి బ్రదర్సే ఉంటారు. కేతిరెడ్డి(Kethireddy) దేని గురించి మాట్లాడినా మీ పార్టీకి చెందిన ప్రకాష్ రెడ్డి సోదరులు కనిపిస్తారు.

Also Read: పరిటాల శ్రీరామ్ కు టిక్కెట్ ఖరారు.. ఆల్ ది బెస్ట్ చెప్పిన కేతిరెడ్డి

ఎన్టీఆర్ (NTR)రాష్ట్ర ప్రజలకు ఒక ఆదర్శం.. లోకేశ్ ఆయన పేరు మాట్లాడితే తప్పేంటి. పరిటాల రవి పేరు ఎక్కువగా తలచుకుంటున్నావు.. మంచిగా తలుచుకో ఆయన గురించి చెడుగా తలుచుకుంటే ఎక్కడికి పోతావో చూసుకో. ధర్మవరంలో జరిగిన అన్యాయం గురించి చెబుతున్నాం.. అవి కాదని నిరూపించుకో. నాకు ఆల్ ది వెరీ బెస్ట్ చెప్పినందుకు కేతిరెడ్డికి ధన్యవాదాల’ని అన్నారు.

ట్రెండింగ్ వార్తలు