Pawan Kalyan : పవన్ కల్యాణ్‌ను నమ్ముకుంటే నట్టేట ముంచుతాడు- వైసీపీలో చేరిన పసుపులేటి సందీప్ రాయల్, పద్మావతి

Allegations On Pawan Kalyan : మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపితే మీరందరూ మోసపోవడం ఖాయం. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే పవన్ కల్యాణ్ కు మఖ్యం. రాజకీయాల్లో మార్పు తెస్తామంటే పవన్ వెంట నడిచాం.

Allegations On Pawan Kalyan (Photo : Google)

పవన్ కల్యాణ్ ను నమ్ముకుంటే మాలాగే అందర్నీ రోడ్డున పడేస్తాడు, నట్టేట ముంచుతాడు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు పసుపులేటి పద్మావతి, సందీప్ రాయల్. అందరినీ ప్రశ్నిస్తానన్న పవన్ కల్యాణ్ మా ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు. పార్టీకి తొలి నుంచి సేవలు అందిస్తున్న మమ్మల్ని కాదని కోట రుక్మిణికి ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ప్రశ్నించారు.

పసుపులేటి పద్మావతి, సందీప్ రాయల్.. సజ్జల రామకృష్ణారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. అనంతరం పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి ఆరోపణలు చేశారు. పసుపులేటి సందీప్ జనసేనలో పవన్ కల్యాణ్ కు పర్సనల్ సెక్రటరీగా పని చేశారు. పసుపులేటి పద్మావతి జనసేన పార్టీ రాయలసీమ రీజియన్ సమన్వయకర్తగా పని చేశారు.

”రుక్మిణి కోసం మమ్మల్ని ఎందుకు గెంటేశారు. కోట రుక్మిణి అంటే మీకు భయం ఎందుకు? రుక్మిణి కోసం.. పార్టీని నమ్ముకుని పని చేస్తున్న 32మందిని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గెంటేయడం న్యాయమేనా? మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపితే మీరందరూ మోసపోవడం ఖాయం. యువత తల్లిదండ్రులూ మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపొద్దు. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే పవన్ కల్యాణ్ కు మఖ్యం.
రాజకీయాల్లో మార్పు తెస్తామంటే పవన్ వెంట నడిచాం.

Also Read : వాలంటీర్లను తొలగించండి- కేంద్ర ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

చంద్రబాబుతో పని చేసేందుకు ఏ జనసేన కార్యకర్త సిద్ధంగా లేడు. తెలుగుదేశం నేతలు జన సైనికులను కూలీలుగా చూస్తున్నారు. అవమానిస్తున్నారు. రాయలసీమలో జనసేన పార్టీలో బలిజలను రాజకీయంగా తొక్కేస్తున్నారు. జనసేన పార్టీలో క్రియాశీలకంగా ఉండే మహిళలను ఎదగనీయడం లేదు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం రాదు. చంద్రబాబు-పవన్ కల్యాణ్ ల కలయికను ప్రజలు ఆమోదించడం లేదు. పేద, బడుగు వర్గాలకు జగన్ ఇస్తున్న పథకాలు మేలు చేస్తున్నాయి. అందుకే వైసీపీలో చేరాము” అని పసుపులేటి పద్మావతి, సందీప్ రాయల్ అన్నారు.

పవన్ కల్యాణ్‌కి రుక్మిణీ అంటే భయం- పసుపులేటి సందీప్ రాయల్
”పవన్ కల్యాణ్ మాటలతో మభ్యపెడతారు. పవన్ ను నమ్ముకుని ఢిల్లీ లీడర్ కావాలనుకున్న నేను గల్లీకి కూడా కాకుండా పోయాను. పార్టీ కేంద్ర కార్యాలయంలో కోట రుక్మిణి అనే మహిళ మాట మీద నన్ను మా అమ్మ (పసుపులేటి పద్మావతి)ను పవన్ రోడ్డుకీడ్చారు. నాదెండ్ల మనోహర్ కు చిత్తశుద్ధి లేదు.

పవన్ కి రుక్మిణీ అంటే భయం. పవన్ కల్యాణ్ అహంకారి. తను లేకుండా నాదెండ్ల మనోహర్ కూడా అసెంబ్లీకి వెళ్ళకూడదనుకుంటారు. పార్టీ ఆఫీసుకు హవాలా డబ్బు పంపి మారుస్తారు నాదెండ్ల. హైదరాబాద్ లో భూకబ్జాలో A1 గా ఉన్న వ్యక్తిని పార్టీ కమిటీలో పెట్టారు పవన్. టీడీపీ కోసమే పవన్ కల్యాణ్ పని చేస్తున్నారు. రాజకీయాల్లో మాట తప్పారు పవన్. ప్రజలు ఓడించినా పవన్ ఎందుకు పోటీ చేస్తారు.

టీడీపీ పంచన చేరి మమ్మల్ని మోసం చేశారు. పవన్ కు కాపులు కావాలనుకుంటే పవన్ ముందు పెద్దన్న పాత్ర వహించాలి. రాయలసీమలో బలిజలను తొక్కేస్తున్నారు. పవన్ మాటల మాయలో పడి పని చేశాము. అక్కడ నుంచి బయటకు వచ్చి సీఎం జగన్ అమలు చేస్తున్న పథకాలను పరిశీలించిన తర్వాత రాష్ట్రానికి జగన్ ఎంత మేలు చేస్తున్నారో అర్థమైంది. అందుకే ఈరోజు వైసీపీలో చేరాం” అని పసుపులేటి సందీప్ రాయల్ అన్నారు.

Also Read : చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

పవన్ నిలకడలేని మనిషి, మీ పిల్లలను పంపొద్దు- పసుపులేటి పద్మావతి
”చిరంజీవి అభిమానిగా ప్రజారాజ్యంతో రాజకీయాల్లోకి వచ్చా. 2014లో జనసేనకు అండగా నిలబడ్డా. పసుపులేటి పద్మావతి అనే నేను.. పవన్ ను నమ్మి, ఆయన చెప్పిన మాటలు విని సివిల్స్ కు ప్రిపేర్ అవుతున్న నా బిడ్డను ఆయన దగ్గరకు పంపితే ఈరోజు రోడ్డున పడేసి చాలా గొప్ప బహుమతి ఇచ్చారు. పవన్ ను నమ్మి యువతను (మీ పిల్లలను) ఎవరూ పవన్ వద్దకు పంపొద్దని ఒక తల్లిగా ఎంతో ఆవేదనతో పవన్ ను అభిమానిస్తున్న తల్లిదండ్రులను కోరుతున్నా.

పవన్ మాట తప్పి మమ్మల్ని బయటకు పంపేశారు. నాదెండ్ల మనోహర్ మహిళలను ఎదగనివ్వకుండా తొక్కేశారు. మహిళా నేతలకు జనసేనలో గౌరవం లేదు. పవన్ కల్యాణ్ పార్టీకి అంకితభావంతో పని చేసే తమలాంటి వారిపట్ల సరైన విధంగా లేకపోవడంతోనే మహిళలకు జనసేనలో గౌరవం లేదు. ఈ అంశం మీద ఎక్కడైనా ఎవరితోనైనా డిబేట్ కు రెడీగా ఉన్నానని సవాల్ విసురుతున్నా.

తెలుగుదేశం-జనసేన కలవడాన్ని ప్రజలు ముఖ్యంగా జనసైనికులు అంగీకరించడం లేదు. టీడీపీ నాయకులు కూడా జనసేన కార్యకర్తలను అవమానిస్తున్నారు. ఎన్నికల్లో జనసేన-టీడీపీ కూటమి విజయం సాధించే ప్రసక్తే లేదు. పవన్ నిలకడ లేని మనిషి. ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో తెలియదు. ఆయనను నమ్మి రాజకీయాల్లోకి వస్తే నట్టేట మునగడం ఖాయం. పేద, బడుగు వర్గాలకు సీఎం జగన్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారు. జగన్ మరోసారి విజయం సాధించడం ఖాయం” అని జోస్యం చెప్పారు పసుపులేటి పద్మావతి.