Chandrababu Bail : చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

CID Petition In Supreme Court: ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యానించారు.

Chandrababu Bail : చంద్రబాబుకి బెయిల్.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ సీఐడీ, అప్రజాస్వామికం అన్న పొన్నవోలు

CID Petition In Supreme Court

స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఏపీ సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సీఐడీ వాదనలను హైకోర్టు పరిగణలోకి తీసుకోకపోవడంపై అభ్యంతరం తెలిపింది. హైకోర్టు తీర్పు న్యాయ సమ్మతం, చట్ట సమ్మతం కాదని.. చంద్రబాబుకు హైకోర్టు బెయిల్ ఇవ్వడం దురదృష్టకరం అని ఏపీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అన్నారు.

హైకోర్టు తీర్పు దురదృష్టకరం- పొన్నవోలు సుధాకర్ రెడ్డి
సీఐడీ వాదనను హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు, అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించాము అని వివరించారు. ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యానించారు. ఏపీ స్కిల్ కేసును ఈడీ, సీఐడీ దర్యాప్తు జరుపుతోందని, చార్జిషీట్ వేసినప్పుడు నిజానిజాలు బయటకు వస్తాయని ఆయన అన్నారు. సాక్ష్యాలు ఆధారాలు ట్రయల్ కోర్టు దగ్గర ఉంటాయని వెల్లడించారు. హైకోర్టు తన పరిధి దాటి వ్యవహరించింది అని కామెంట్ చేశారు.

ప్రభుత్వ సొమ్ము దోచేశారు- పొన్నవోలు సుధాకర్ రెడ్డి
సీఐడీ వాదనను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకునే అధికారం ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ అధికార దుర్వినియోగం చేయడానికి తన మనుషులకు దోచి పెట్టడానికి ముఖ్యమంత్రిగా అధికారం లేదు. రూ.371 కోట్ల ప్రభుత్వ సొమ్ము దోచేశారు. సీమెన్స్ నివేదిక, కొనర్ రిపోర్ట్, ఫోరెన్సిక్ నివేదికను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.

Also Read : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. నేతల పరామర్శలు.. నేనొస్తున్నానంటూ పవన్ ట్వీట్

ఇది ఆర్ధిక నేరం. ఐపీసీ నేరం కాదు. ఈ కేసులో కక్ష సాధింపు చర్య లేదని హైకోర్టు స్పష్టం చేసింది. సెక్షన్ 17 ఏ కేసు తీర్పు రిజర్వ్ చేయబడింది. 17 ఏ కేసు క్వాష్ పిటిషన్ లో బెయిల్ అంశం ఉందని మేము హైకోర్టుకి చెప్పినా ఆ అంశాన్నీ హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. హైకోర్టు తీర్పులో కనీసం మెన్షన్ చెయ్యలేదు. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ ఇవ్వాలనుకుంటే జైల్లో 73ఏళ్లు దాటిన వారందరి కోసం సీఆర్పీసీ చట్టం సవరిస్తే గొడవే ఉండదు. స్కిల్ కేసులో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నాం కాబట్టి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వచ్చాం.

జడ్జిని ప్రశించే హక్కు మాకు లేదు. కానీ,- పొన్నవోలు సుధాకర్ రెడ్డి
”మూడు 10 రూపాయల నోట్లు ద్వారా సీమెన్స్ కంపెనీకి హైదరాబాద్ లో డబ్బులు చేతులు మారాయి. టీడీపీ పార్టీ అకౌంట్ లో గుర్తించని డబ్బులు ఉన్నాయి. వాటి వివరాల కోసం బ్యాంకులను సంప్రదిస్తున్నాం. ప్రజాధనం 370 కోట్లు లూటీ చేశారు. ఆధారాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈడీ సంస్థ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తోంది. చార్జిషీట్ వేసిన తర్వాత మాత్రమే కోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.

Also Read : హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్

జడ్జిని ప్రశించే హక్కు మాకు లేదు. కానీ జడ్జిమెంట్ ని ప్రశ్నించే హక్కు మాకుంది. 17ఏ గురించి ప్రతి ఒక్కరూ చర్చలు చేసి సొంత జడ్జిమెంట్లు ఇస్తున్నారు. చంద్రబాబు బెయిల్ ను సవాల్ చేస్తూ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టులో డైరీ నెంబర్ వచ్చింది. త్వరగా విచారణకు వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తాం” అని ఏపీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి తెలిపారు.