Payyavula Keshav : హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్

Payyavula Keshav On CM Jagan : చేయని తప్పునకు చంద్రబాబు 50 రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది.

Payyavula Keshav : హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్

Payyavula Keshav On CM Jagan

చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్. సీఎం జగన్ పై ఆయన నిప్పులు చెరిగారు. జగన్ ప్రభుత్వం దురుద్దేశంతో చంద్రబాబుపై కేసు నమోదు చేసిందనే రీతిలో కోర్టు వ్యాఖ్యలు ఉన్నాయని పయ్యావుల కేశవ్ అన్నారు. చంద్రబాబుకు పూర్తి బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు చేసిన వ్యాఖ్యల్లో ప్రభుత్వాన్ని, సీఐడీని చాలావరకు తప్పు పట్టిందన్నారు.

ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేదు..
మేము ఇన్నాళ్లూ చేసిన వాదనలనే బెయిల్ తీర్పులో కోర్టు ప్రస్తావించిందని పయ్యావుల పేర్కొన్నారు. స్కిల్ కేసులో మొదటి నుంచి చివరి వరకు చంద్రబాబు కనుసన్నల్లో ఉన్నట్టుగా సీఐడీ చిత్రీకరించిందన్నారు. సీఎంగా ఉన్న చంద్రబాబుకి ఏమీ సంబంధం లేదనే రీతిలో కోర్టు వ్యాఖ్యానించిందన్నారు. సీఐడీ చేసిన ఆరోపణలకు, అభియోగాలకు ఆధారాలు చూపలేదని కోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు. అసలు ఆధారాలుంటే కదా చూపడానికి..? అని ఆయన వ్యాఖ్యానించారు. టీడీపీ అకౌంట్ లోకి స్కిల్ కేసు డబ్బులు వచ్చాయని కూడా ప్రాథమిక ఆధారాలు కూడా చూపలేదని కోర్టు అభిప్రాయపడిందని పయ్యావుల అన్నారు.

Also Read : స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..

30రోజులు జైల్లో ఉంచిన తర్వాత కూడా..
”సరైన ఆధారాలు లేకుండా రిమాండ్ కు ఎలా పంపారనే భావన వచ్చేలా కోర్టు వ్యాఖ్యలున్నాయి. చంద్రబాబుకి డబ్బులు చేరాయనే అభియోగానికి ఎలాంటి ఆధారాలు సీఐడీ చూపలేకపోయారని కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. 30 రోజులు జైల్లో ఉంచిన తర్వాత కూడా చంద్రబాబుకు లబ్ది చేకూరిందనే ఆధారాలు చూపలేకపోయారని కోర్టు స్పష్టంగా చెప్పింది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు నష్టం ఎలా జరిగిందనే ఆధారమూ లేదని కోర్టు వ్యాఖ్యానించింది. ఎలాంటి ప్రాథమిక ఆధారాలను కూడా సమర్పించలేకపోయారని కోర్టు అభిప్రాయపడింది.

ఇప్పుడు వైసీపీ ఏమంటుంది..?
సునీత ఫైల్ చదవకుండానే కామెంట్లు రాశారని మేం గతంలోనే చెప్పాం. టీడీపీ తప్పుడు సమాచారంతో తప్పుదోవ పట్టిస్తోందని సజ్జల వంటి వారు మాట్లాడారు. మేం చెప్పిన దాంతోనే కోర్టు ఏకీభవించింది. ఇప్పుడు వైసీపీ ఏమంటుంది..? బెయిల్ ఆర్డర్ లోనే ఫైనల్ జడ్జిమెంట్ లో రాసినట్టు కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. పన్ను ఎగవేత విషయంలో అప్పటి సీఎం చంద్రబాబుకు సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడింది.

Also Read : యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?

చేయని తప్పుకు 50రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి..
స్కిల్ కేసులో సీఐడీకి ఏం తోచిందో అదే పెట్టేశారు. కోర్టు తీర్పు, కామెంట్లు వైసీపీకి చెంపపెట్టు. కోర్టు వ్యాఖ్యానాలు చూస్తే చంద్రబాబుకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. చేయని తప్పుకు 50 రోజులు జైల్లో గడపాల్సిన పరిస్థితి వచ్చిందనేది ఈ తీర్పులో కోర్టు చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైంది” అని పయ్యావుల కేశవ్ అన్నారు.