Visakha Fishing Harbour : యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?

బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్ టౌన్ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.

Visakha Fishing Harbour : యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?

YouTuber local boy Nani arrest

Visakha Fishing Harbour – YouTuber Arrest : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ లోకల్ బాయ్ నానిని వన్ టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిన్న సాయంత్రం లోకల్ బాయ్ నాని తన భార్య శ్రీమంతం వేడుకలు నిర్వహించారు. తన భార్య శ్రీమంతం సందర్భంగా లోకల్ బాయ్ నాని స్నేహితులకు బోటులో పార్టీ ఇచ్చారు. పార్టీ అనంతరం బోటుకు నిప్పు అంటుకుంది. లోకల్ బాయ్ నాని అగ్ని ప్రమాదాన్ని వీడియో తీసి యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు.

ఇతర మత్స్యకారులు లంగర్ వేసిన బోటును వదిలారు. నిప్పు పెట్టిన బోటు జట్టి నెంబర్ 1లో పడవల వద్దకు చేరుకోవడంతో భారీ ప్రమాదంద జరిగింది. సిలిండర్ పేలడంతో వేగంగా మంటలు వ్యాపించాయి. పడవల్లో డీజిల్, చేపలు ఉన్నాయి. డీజిల్ ఉండటంతో బోట్లు తగలబడిపోయాయి. ప్రమాద సమయంలో హార్బర్ లో 400 రవకు పడవలు ఉన్నాయి. 60 నుంచి 70 బోట్ల వరకు దగ్ధమయ్యాయని మత్స్యకారులు అంటున్నారు.  బోటుకు నిప్పు ఎలా అంటుకుందనేది దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. వన్ టౌన్ సిఐ భాస్కరరావు లోతైన విచారణ చేస్తున్నారు.

Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

ఫిషింగ్ హర్బర్ వద్ద ఆందోళన చేస్తున్న మత్స్యకారుల వద్దకు మంత్రి సీదిరి అప్పలరాజు చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని మంత్రి పరిశీలించారు. మత్స్యకారులకు న్యాయం చేస్తామని హమీ ఇచ్చారు. సీఎం రావాలంటూ మత్స్యకారులు ఆందోళన చేపట్టారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం అన్నారు. ప్రమాదానికి గల కారకులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నామని, వారికి కఠిన శిక్షలు తప్పవన్నారు. 36 బోట్లు పూర్తిగా, 9 పాక్షింగా దెబ్బతిన్నాయని తెలిపారు.

డామేజ్ అయినా బోటు విలువ బట్టి 80% నష్టపరిహారం చెల్లిస్తామన్నారు. నేవీ, ఫైర్ సిబ్బంది సహాయంతో ప్రమాదం తీవ్రత ఎక్కువ అవ్వకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు.  గతంలో రెండు సార్లు ఫిషింగ్ హార్బర్ లో బోట్లు దెబ్బతిన్నాయని తెలిపారు. హుద్ హుద్ తుఫాన్, తిట్లి తుఫాన్ సమయంలో బోట్లు డామేజ్ అయ్యాయని పేర్కొన్నారు. అప్పటి ప్రభుత్వం డ్యామేజీ బోట్లకు హామీ ఇచ్చిన నెరవేర్చలేదని విమర్శించారు.

Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ పై కేసు నమోదు?

గత ప్రభుత్వం హామీలు నెరవేర్చలేదన్న భయంతోనే ప్రస్తుతం మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. డామేజైనా ప్రతీ బోటు యజమానికి, మత్స్యకారుడికి న్యాయం చేయమని సీఎం చెప్పారని తెలిపారు. ఆకతాయిలు చేసిన పనికి ఈ ప్రమాదం జరిగిందన్నారు. కొంతమంది ఆకతాయిలను గుర్తించి విచారణ కొనసాగిస్తున్నామని తెలిపారు.