Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ పై కేసు నమోదు?

రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు.

Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో యూట్యూబర్ పై కేసు నమోదు?

Visakha fire accident YouTuber

Updated On : November 20, 2023 / 11:52 AM IST

Visakha Fishing Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాదం ఘటనలో ఓ యూట్యూబర్ పై పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. నిన్న రాత్రి ఫిషింగ్ హార్బర్ లో యూట్యూబర్ పార్టీ ఇచ్చారు. ఈ క్రమంలో మద్యం మత్తులో గొడవ జరుగినట్టు పోలీసులు గుర్తించారు. పార్టీ ఇచ్చిన యూట్యూబర్ పరారిలో ఉన్నారు. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. య్యూబర్ పై కేసు నమోదు చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

విశాఖ ఫిషింగ్ హార్బర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో 40-50 బోట్ల వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. ప్రమాద సమయంలో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. మంటలు ఒక బోటు నుంచి మరో బోటుకు అంటుకున్నాయి. ఫిషింగ్ హార్బర్ లోని ఒకటో నెంబర్ జెట్టి వద్ద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఇది ఫిషింగ్ హార్బర్ చరిత్రలో కనివిని ఎరుగని అగ్నిప్రమాదం. బోట్లలలో ఉండే డీజిల్, పెట్రోల్ గ్యాస్ నిల్వలతో మంటలు మరింత వ్యాపించాయి.

Vasupalli Ganesh Kumar : గతంలో ఎన్నడూ ఇలాంటి ప్రమాదం జరగలేదు : ఎమ్మెల్యే వాసుపల్లి

ఈ ప్రమాదంతో మత్స్యకారులు తీవ్ర భయాందోళనకు గురయ్యీరు. జీవనాధారం అయిన బోట్లు కళ్ళెదుటే మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లు, ఒక ఫైర్ టగ్ నౌక తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీ టాగ్ నౌక సహయంతో సుమారు 5 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.

బాధితులను ఆదుకోవాలని సీఎం జగన్ ఆదేశం
విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలన్నారు. బాధితులకు తగిన సహాయం చేయాలని ఆదేశించారు.