Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఒక బోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు

fire

Visakha Fishing Harbour Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. హార్బర్ లో బోట్లుకు నిప్పు అంటుకోని బోట్లు తగలబడుతున్నాయి. 40 బోట్లు వరకు అగ్నికి ఆహుతి అయ్యాయి. భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ఒకబోటు తరువాత మరో బోటుకు మంటలు అంటుకున్నాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తోంది.

ఫిషింగ్ హార్బర్ లోని ఒకటో నెంబరు జెట్టి వద్ద అర్ధరాత్రి భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఫిషింగ్ హార్బర్ చరిత్రలో కనివిని ఎరుగని అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఫిషింగ్ హార్బర్ కు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైర్ ఇంజన్లు, ఒక ఫైర్ టగ్ నౌక తో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. బోట్లలలో ఉండే ఇంధనాలు, డీజిల్ పెట్రోల్ గ్యాస్ నిల్వలతో మంటలు మరింత వ్యాపించాయి. సముద్రంలో నుండి మంటలను అర్పే ప్రయత్నం చేశారు.

Today Headlines : విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌లో భారీ అగ్నిప్రమాదం.. నేడు తెలంగాణకు మరోసారి అమిత్‌షా రాక

పేలుళ్లకు భయాందోళనకు గురైన మత్స్యకారులు
పేలుళ్లు సంభవిస్తుండడంతో మత్స్యకారులు భయాందోళనకు గురవుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు పరిస్థితి కష్ట తరంగా మారింది. కళ్ళెదుటే జీవనాధారం అయిన బోట్లు మంటలకు ఆహుతి అయి పోతుండడంతో మత్స్యకార కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. అగ్నిమాపక సిబ్బంది భారీ టాగ్ నౌక సహయంతో సుమారు నాలుగు గంటల పాటు శ్రమించి మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

బోట్ లలో నిల్వ ఉంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ పదార్ధాలు ఉండడంతో భారీ పేలుళ్లు సంభవించాయి. ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఇంకా రాని స్పష్టత రాలేదు. ఎవరో ఆకతాయిలు కావాలనే మంటలు పెట్టి ఉంటారని మత్స్యకార బోట్ల సంఘ నాయకులు భావిస్తున్నారు.

Nampally Fire Incident : నాంపల్లి అగ్నిప్రమాదం ఎలా జరిగింది..?

కోట్ల రూపాయల్లో భారీ ఆస్తి నష్టం!

బోట్లలో రాత్రి వేళ నైట్ వాచ్ మెన్లు ఉంటున్నారు. ప్రాణ నష్టంపై ఇంకా స్పస్థత రాలేదు. కాగా, విశాఖ ఇండియా – ఆస్ట్రేలియా మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ పెట్టిన మంటగా అనుమానిస్తున్నారు. ఇండియా ఓటమి కావడంతో బోట్లు తగలపెట్టి ఉండవచ్చని మత్స్యకారులు భావిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ వద్దకు భారీగా మత్స్యకారులు చేరుకుంటున్నారు. మంటలకు ఆహుతి అయిన బోట్లను చూసి గంగపుత్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.

కాలిపోయిన బోట్లలో సగం సముద్రంలో మునిగిపోయాయి. కోట్ల రూపాయల్లో భారీ ఆస్తి నష్టం వాటిల్లినట్లు చెబుతున్నారు. సుమారు 40-50 వరకు బోట్లు దగ్ధం అయ్యి ఉండొచ్చు అని అంచనా. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు. కాగా, ఫైర్ సిబ్బంది ఐదు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

విశాఖ ఫిషింగ్‌ హార్బర్‌ అగ్నిప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
విశాఖపట్నం ఫిషింగ్‌ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను ఆదుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలన్నారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని సూచించారు. ప్రమాదంలో బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.