Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు భారీ ఊరట..

Chandrababu: స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఊరట లభించింది. ఈ విషయమై సోమవారం విచారణ చేపట్టిన ఆంధ్రప్రదేశ్ అత్యున్నత న్యాయస్థానం రెగ్యూలర్ బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఇచ్చిన బెయిల్ ఈ నెల 28 వరకు ఉంది. అయితే అది ఇంకా ముగియక ముందే మళ్లీ బెయిల్ రావడం గమనార్హం. ఇక తాజాగా ఈ కేసు విషయమై సోమవారం హైకోర్టులో ఇరు వర్గాల వాడీవేడీ వాదనలు వినిపించాయి.

గత విచారణలో తీర్పు రిజర్వ్ చేసిన హై కోర్టు.. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. బాబుకు బెయిల్ లభించడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు సంబరాల్లో మునిగారు. ముందుగా ఊహిచంనట్లుగానే మధ్యామ్నం 2:15 కు జస్టీస్ మల్లికార్జున్ రావు ధర్మాసనం ఆర్డర్స్ ఇచ్చింది. అంతకు ముందు కోర్టు ముందు చంద్రబాబుకు గుండె సమస్యలపై వైద్యులు ఇచ్చిన మెడికల్ రిపోట్స్ ను ఆయన తరుపు అడ్వకేట్స్ సబ్మిట్ చేశారు. ప్రస్తుతం హెల్త్ గ్రౌండ్స్ పై మధ్యంతర బెయిల్ తో బాబు బయట ఉన్నారు. మరో 8 రోజుల్లో మధ్యంతర బెయిల్ సమయం ముగుస్తుందనగానే మళ్లీ బెయిల్ లభించింది.

ఇది కూడా చదవండి: వరల్డ్ కప్ ఓడిపోవడంతో.. టాలీవుడ్ సెలబ్రిటీస్ ఎమోషనల్ ట్వీట్స్..

Chandrababu Naidu

29 నుంచి రాజకీయ సభల్లో పాల్గొనవచ్చు.. 

ఈ తీర్పులో కోర్టు మరో భారీ ఉపశమనమే కల్పించింది. ఈ నెల 29 నుంచి ఆయన పబ్లిక్ ర్యాలీలు, సభల్లో పాల్గొనవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, రాజకీయ పెద్దలు చెప్పినట్లు ఏపీ సీఐడీ నడుచుకుంటోందని చంద్రబాబు తరపున న్యాయవాదులు గురువారం వాదనలు వినిపించారు. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం, సీఐడీ దురుద్దేశ పూర్వకంగా, రాజకీయ కక్షతో చంద్రబాబుపై తప్పుడు కేసులు నమోదు చేశాయని, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ లొంగిపోయేటప్పుడు రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌కు సీల్డ్‌కవర్లో వైద్యనివేదికలు అందజేయాలని న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను పిటిషనర్‌ ఉల్లంఘించారు.

ఇక ప్రభుత్వ తరపు లాయర్లు వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు ప్రభుత్వ వైద్యులతో పరీక్షలు చేయించాలని అన్నారు. మధ్యంతర బెయిల్‌ పొందిన చంద్రబాబు హైదరాబాద్‌ వెళ్లి ర్యాలీ నిర్వహించి, కోర్టు షరతులను ఉల్లంఘించారని పేర్కొన్నారు. బేగంపేట పోలీసులు ఆయనపై కేసు నమోదుచేశారని, ఈ కేసులో ఇతర నిందితులకు బెయిల్‌ మంజూరయిందన్న కారణంతో పిటిషనర్‌కు బెయిల్‌ ఇవ్వాలని న్యాయవాదులు కోరడం సరికాదని వాదించారు. అందువల్ల బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. అయితే ఇరుపక్షాల వాదనలు విని తీర్పును రిజర్వు చేసిన హైకోర్టు తాజాగా బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది.

ఇది కూడా చదవండి: అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ

హైకోర్టు తీర్పు కోసం ఇక్కడ క్లిక్ చేయండి