Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. నేతల పరామర్శలు.. నేనొస్తున్నానంటూ పవన్ ట్వీట్

ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్నిమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్ట పరిహారం పంపిణీలో

Visakha Fishing Harbour : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో ప్రమాదంపై దర్యాప్తు ముమ్మరం.. నేతల పరామర్శలు.. నేనొస్తున్నానంటూ పవన్ ట్వీట్

Visakha Fishing Harbour

Visakha Fishing Harbour Fire Accident : విశాఖ తీరంలోని చేపలరేవులో ఆదివారం అర్థరాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 45 మెకనైజ్డ్ బోట్లు మంటల్లో చిక్కుకున్నాయి. వీటిలో 36 బోట్లు దగ్దమయ్యాయి. సుమారు రూ. 15కోట్ల ఆస్తి నష్టం వాటిల్లింది. సోమవారం ఉదయం అగ్నిమాపక శాఖ, పోర్టు నౌకాదళం సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దగ్దమైన బోట్ల విలువలో 80శాతం పరిహారంగా ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. లోతైన దర్యాప్తు నిర్వహించి, ప్రమాద కారణాలను వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై విచారణకు జిల్లా కలెక్టర్ కమిటీని నియమించారు. రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Also Read : Visakha Fishing Harbour : యూట్యూబర్ లోకల్ బాయ్ నాని అరెస్టు.. అసలు ఏం జరిగిందంటే?

పోలీస్ స్టేషన్ లోనే లోకల్ బాయ్ నాని..
అగ్ని ప్రమాదం ఘటన నేపథ్యంలో  యూట్యూబర్ ‘లోకల్ బాయ్’ నానిని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అతనితోపాటు మరో 10మందిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ప్రమాదం ఎలా జరిగింది.. యూట్యూబర్ పాత్రపైనా ఆరా తీస్తున్నారు. ప్రతిఒక్కరి కాల్ డేటా, సీసీ పుటేజ్ లను పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, ఈ ఘటనపై  పోలీసులు ప్రమాదవశాత్తు జరిగినట్లు కేసు నమోదు చేశారు.

Also Read : Fire Accident : విశాఖ ఫిషింగ్ హార్బర్ లో భారీ అగ్నిప్రమాదం.. అగ్నికి ఆహుతైన 40 బోట్లు
నేతల పరామర్శ..
చేపలరేవులో అగ్నిప్రమాదం నేపథ్యంలో నష్టపోయిన బాధితులను అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు పరామర్శిస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్ని వైసీపీ నేత వైవి సబ్బారెడ్డి, వైసీపీ నేతలు సందర్శించారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. సమాచారం తెలిసిన వెంటనే ప్రభుత్వం స్పందించిందని, ప్రాణనష్టం లేకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. పక్కనే డీజిల్ ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నా.. ప్రభుత్వం చర్యల వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అన్నారు. ఇన్సూరెన్స్ తో సంబంధం లేకుండా సీఎం జగన్ సహాయానికి చర్యలు తీసుకున్నారని తెలిపారు. గత ప్రభుత్వ హామీలు పూర్తి కాకపోవడంతో బోటు ఓనర్ లలో అపోహలున్నాయని, మా ప్రభుత్వం భరోసా ఇచ్చిందంటే.. వాటిని పూర్తి చేసి అండగా నిలబడతామని అన్నారు. ప్రమాదం వెనుక కుట్ర, ఆకతాయి తనం ఉన్నా క్రిమినల్ చర్యలు తీసుకోవటం జరుగుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.

Also Read : Payyavula Keshav : హైకోర్టు తీర్పు వైసీపీకి చెంపపెట్టు, చంద్రబాబుకి క్షమాపణ చెప్పాలి- పయ్యావుల కేశవ్

ఘటన స్థలిని పరిశీలించిన టీడీపీ నేతలు ..
ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్నిమాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, టీడీపీ నేతలు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా గంటా మాట్లాడుతూ.. ప్రభుత్వం నష్ట పరిహారం పంపిణీలో జాప్యంలేకుండా చూడాలని, బాధితలను తక్షణమే ఆదుకోవాలని అన్నారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. నూరుశాతం పరిహారం అందించాలని, బోట్లతో పాటు సరుకు, ఆయిల్ కాలిపోయిందని, బోట్లపై ఆధారపడి ప్రమాదంలో ఉపాధి కోల్పోయిన వారికి రూ. 20వేలు పరిహారం ఇవ్వాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

 

బీజేపీ నేతల పరిశీలన ..
ఫిషింగ్ హార్బర్ లో ప్రమాద ఘటన స్థలాన్ని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, బీజేపీ నేతలు సందర్శించారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర ఫిషరీస్ మంత్రి రూపాలాకు తెలియజేశామని జీవీఎల్ చెప్పారు. ఘటన స్థలానికివెళ్లి బాధితులకు భరోసా ఇవ్వాలని నన్ను పంపించారని చెప్పారు. స్టేట్ డిజైస్టర్ లో 90శాతం నిధులు కేంద్రమే అందిస్తుందని, పరిహారం తక్షణమే అందేలా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని జీవీఎల్ అన్నారు. గంటలు గడుస్తున్నప్పటికీ ప్రమాదానికి గల కారణాలు పోలీసులు చెప్పలేకపోతున్నారని అన్నారు. ఈ ఘటన మానవ తప్పిదంలా అనిపిస్తోందని, అనధికార వ్యక్తులు ఫిషింగ్ హార్బర్ కు వస్తున్నారు.. హార్బర్లో భద్రత పెంచాలని గతంలోనే చెప్పామని జీవీఎల్ అన్నారు. తక్షణమే పోలీస్ పికెట్ ఏర్పాటు చేయాలని, ఘటనకు గల కారణాలపై వెంటనే నివేదిక ఇవ్వాలని అన్నారు. కేంద్ర మత్స్య సంస్థలతో బాధితులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని జీవీఎల్ తెలిపారు.

 

పవన్ కల్యాణ్ ట్వీట్ ..
విశాఖ షిప్పింగ్ హార్బర్ లో జరిగిన 60కిపైగా బోట్ల దగ్దం జరిగి నష్టపోయిన బోట్ ల యాజమానులకు, వారి కుటుంబాలకు జనసేన పార్టీ తరపు నుండి యాబై వేల రూపాయలు ఆర్థిక సాయం చేయాలని నేను నిర్ణయించుకున్నానని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే రెండుమూడు రోజుల్లో నేనే స్వయంగా వచ్చి సాయం సొమ్ము అందిస్తానని, వారి కుటుంబాలకు జనసేన అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇదిలాఉంటే.. విశాఖలో ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం సందర్భంగా వారికి జనసేన నాయకులు, కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జరిగిన సమావేశంలో బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ.. నిన్న జరిగిన ప్రమాదం యావత్తు దేశాన్ని కలవరపర్చింది. 100 బోట్లు పెట్టాల్సిన జట్టీలో 700 బోట్లు పెట్టారు. ఒక్క బోటుకు బదులుగా 42 బోట్లు కాలిపోయాయి. కాలిన బోట్లకు బదులుగా కొత్త బోట్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్త బోట్లు వచ్చేవరకు వాటి పైన ఆధారపడిన మత్స్యకార కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.