×
Ad

రామమందిర నిర్మాణానికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ భారీ విరాళం

  • Published On : January 22, 2021 / 02:07 PM IST

Pawan Kalyan :అయోధ్య రామ మందిరం నిర్మాణానికి తన వంతుగా రూ.30లక్షల విరాళాన్ని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. దేశ ప్రజల చిరకాల స్వప్నమైన ఈ అద్భుత కట్టడం నిర్మాణానికి విరాళం అందజేసినట్లుగా ఈ సంధర్భంగా వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో అద్భుతమైన రామమందిర నిర్మాణం భారతీయులందరి కల కాగా.. మందిర నిర్మాణంకు దేశవ్యాప్తంగా భారీగా విరాళాలు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే అయోధ్య రామమందిర నిర్మాణానికి ఇప్పటికే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విరాళాలు ప్రకటిస్తున్నారు.

ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, పలువురు ప్రముఖులు విరాళం ప్రకటించారు. తాజాగా తిరుమల శ్రీవారిని పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. అనంతరం ఈ విరాళం ప్రకటించారు. ఏడాదికాలంగా తిరుపతికి రావాలని అనుకుంటున్నానని, కరోనా కారణంగా కుదరలేదని పవన్ చెప్పారు.