Pawan Kalyan about his movies
Pawan Kalyan : రెండు రోజుల క్రితం విశాఖ జనవాణి కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ వెళితే ఆ కార్యక్రమం జరగకుండా ప్రభుత్వం అడ్డుకున్న సంగతి తెలిసిందే. వైసీపీ మంత్రుల కార్లపై జనసేన కార్యకర్తలు రాళ్లు విసిరారంటూ దాదాపు 90 మందిని అరెస్ట్ చేశారు, పవన్ ని విశాఖ నుంచి వెళ్లిపోవాలని నోటీసులు ఇచ్చారు. దీంతో రెండు రోజులు విశాఖ అంతా వివాదమయంగా మారింది.
ఈ ఘటనతో ఏపీలో పరిస్థితులు వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టు రాజకీయ రణరంగంగా మారాయి. దీనిపై పవన్ కళ్యాణ్ వరుస చర్చలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులపై ఫైర్ అవుతూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ ని కొంతమంది వైసీపీ నాయకులు ప్యాకేజి స్టార్ అని విమర్శిస్తున్నారు. దీనిపై ఘాటుగా పవన్ స్పందించారు.
Rajmouli-Mahesh Movie: రియల్ లైఫ్ స్టోరీతో మహేష్-రాజమౌళి సినిమా.. విజయేంద్రప్రసాద్!
పవన్ కళ్యాణ్ దీనిపై స్పందిస్తూ.. నన్ను ప్యాకేజి స్టార్ అనే వాళ్ళకి ఒకటే చెప్తున్నా. నేను 8 ఏళ్లలో 6 సినిమాలు చేశాను. దాదాపు 120 కోట్లు స్పందించాను. 33 కోట్ల 37 లక్షల ట్యాక్స్ కట్టాను. నాకెవడూ డబ్బులు ఇవ్వనవసరంలేదు. నేను తలుచుకుంటే సినిమాలు చేసి మీకంటే ఎక్కువ సంపాదిస్తాను. ఇంకోసారి ఎవరన్నా నన్ను ప్యాకేజి స్టార్ అంటే చెప్పు తీసుకొని కొడతాను” అని చెప్పు తీసి చూపించారు. దీంతో పవన్ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.