Pawan Kalyan: చంద్రబాబుతో పవన్ కల్యాణ్ భేటీ.. ఈ అంశాలపై చర్చలు

రేపు మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోలను కాల్చేయనున్నారు.

Pawan Kalyan - Chandrababu Naidu

ఆంధ్రప్రదేశ్‌లోని ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నారా లోకేశ్, నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా పవన్ కల్యాణ్‌ను చంద్రబాబు నాయుడు తన ఇంటికి భోజనానికి ఆహ్వానించిన విషయం తెలిసిందే.

టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మ్యానిఫెస్టో రూపకల్పన, ఇతర అంశాలపై ఇరు పార్టీలు స్పష్టతకు రానున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల వేళ వైసీపీ నుంచి టీడీపీ, జనసేన పార్టీల్లోకి పలువురు నేతలు చేరుతుండడం, వారికి సీట్ల కేటాయింపుపై కూడా చర్చిస్తున్నట్లు సమాచారం.

రేపు మందడంలో నిర్వహించే భోగి మంటల కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వ ప్రజావ్యతిరేక జీవోలను కాల్చేయనున్నారు. చంద్రబాబు ఉండవల్లి నివాసానికి పవన్ కల్యాణ్ రావడం ఇదే తొలిసారి. కాగా, మరికొన్ని నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జనసేన, టీడీపీ అభ్యర్థుల విషయంపై తుది నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

కాగా, ఇప్పటికే పలు దశల్లో వైసీపీ తమ అభ్యర్థులపై క్లారిటీ ఇచ్చింది. జనసేన ఈ సంక్రాంతి రోజున తొలి దశలో అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. జనసేన కూడా త్వరలోనే తమ అభ్యర్థులను ఖరారు చేయనుంది.

Vallabhaneni Balasouri: వైసీపీ ఎంపీ వల్లభనేని బాలశౌరి రాజీనామా.. ఆ పార్టీలో చేరతానని ప్రకటన