Pawan Kalyan : ప్రజాపక్షం వహిస్తున్నాం… ఎవరికీ భయపడం : పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు.

Janasena District Presidents Meeting : రాష్ట్రంలో ఛిద్రమైపోయిన రహదారుల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. మరమ్మతులకు తగిన గడువు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. అమరావతిలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో పవన్ కల్యాణ్ తోపాటు నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ శ్రమదానం ద్వారా మరమ్మతులను జనసేన పార్టీ చేపడితే.. ప్రభుత్వం అనుసరించిన పోకడలను ప్రజలందరూ చూశారని పేర్కొన్నారు.

“సగటు మనిషి అభివృద్ధి, తద్వారా రాష్ట్రాభివృద్ధి అనేది జనసేన పార్టీ లక్ష్యం అన్నారు. మనం ప్రజాపక్షం వహిస్తున్నాం… ఎవరికీ భయపడేది లేదని స్పష్టం చేశారు. ఏ అంశాన్నైనా ప్రజా కోణంలోనే విశ్లేషించి వారికి అండగా నిలుద్దామని తెలిపారు. ప్రతి జిల్లాలో పర్యటనకు షెడ్యూల్స్ సిద్ధం చేస్తున్నామని చెప్పారు. జిల్లాకు వెళ్ళినప్పుడే అక్కడ పార్టీ అంశాలపై సమగ్రంగా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు.

TDP Office : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మరో ఆరుగురు అరెస్ట్

పార్టీ శ్రేణులను జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం అనుసంధానం చేస్తూ ముందుకు సాగుదామని నాదెండ్ల మనోహర్ అన్నారు. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చించాలని తెలిపారు. పార్టీ ఇచ్చే కార్యక్రమాలను ప్రభావవంతంగా నిర్వహించాలన్నారు. త్వరలో మండలాధ్యక్షులు, కమిటీల నియామకం ఉంటుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా త్వరలో జరగబోయే మున్పిపల్ ఎన్నికల్లో పూర్తి స్థాయిలో అభ్యర్ధులను బరిలోకి నిలపాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు