TDP Office : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మరో ఆరుగురు అరెస్ట్

గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్

TDP Office : టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. మరో ఆరుగురు అరెస్ట్

Tdp Office

TDP Office : గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా నిందితులను గుర్తించి పట్టుకున్నారు. వీరిలో నలుగురు విజయవాడ వాసులు కాగా, ఇద్దరు గుంటూరుకు చెందిన వారు.

విజయవాడకు చెందిన జోగరాజు, షేక్‌ బాబు, షేక్‌ సైదా, సూర్య సురేష్‌, గుంటూరుకు చెందిన మోహన్‌ కృష్ణారెడ్డి, గురవయ్యలను అదుపులోకి తీసుకున్నారు. మిగతా నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు గుంటూరు అర్బన్‌ ఎస్పీ కార్యాలయం తెలిపింది. మీడియాలో వచ్చిన విజువల్స్ ఆధారంగా పోలీసులు నిందితుల గర్తింపు ప్రక్రియను చేపట్టారు.

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

ఈ నెల 19న టీడీపీ ఆఫీసుతో పాటు ఆ పార్టీ నేత పట్టాభి ఇంటిపై దాడి జరిగింది. ఆఫీసులో విధ్వంసం సృష్టించారు. అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం చేశారు. రెండు దాడులకు సంబంధించి విడివిడిగా కేసులు నమోదు చేశారు పోలీసులు. టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో గుంటూరు, విజయవాడ ప్రాంతాలకు చెందిన 10 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇక పట్టాభి ఇంటిపై దాడికి సంబంధించి 11 మందిని అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.

Porn : షాకింగ్.. పోర్న్ వీడియోలకు అలవాటుపడ్డ 11ఏళ్ల బాలురు.. దానికి ఒప్పుకోలేదని బాలిక హత్య

ఏపీ సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు పట్టాభిని అరెస్ట్ చేయడం, ఆ తర్వాత ఆయనకు బెయిల్ రావడం తెలిసిందే. మరోవైపు టీడీపీ కార్యాలయాలు, నేతల ఇళ్లపై వైసీసీ నేతల దాడిని నిరసిస్తూ ఆ పార్టీ అధినేత చంద్రబాబు 36 గంటల పాటు దీక్ష నిర్వహించారు. దీనికి పోటీగా వైసీపీ కూడా జనాగ్రహ దీక్షలకు పిలుపునిచ్చింది. ఢిల్లీ స్థాయిలో పోరాటం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నారు.