Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

మీరు ఆన్ లైన్ లో ఏదైనా పర్చేజ్ చేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఈ మధ్య తరచుగా ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు పెద్ద పెద్ద షాక్

Amazon లో రూ.70వేల ఖరీదైన ఫోన్ ఆర్డర్‌ చేస్తే అంట్లు తోమే సోప్ పంపారు

Amazon Soap

Amazon : మీరు ఆన్ లైన్ లో ఏదైనా పర్చేజ్ చేస్తున్నారా? అయితే బీ కేర్ ఫుల్. ఆ తర్వాత బాధ పడినా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే, ఈ మధ్య తరచుగా ఈ కామర్స్ సంస్థలు వినియోగదారులకు పెద్ద పెద్ద షాక్ లు ఇస్తున్నాయి. మనం ఒకటి ఆర్డర్ చేస్తే మరొకటి డెలివరీ చేస్తున్నాయి. ఆర్డర్ ఓపెన్ చేసి చూస్తే అందులో సబ్బులు, రాళ్లు, ఇటుకలు ఉంటున్నాయి. ఇటీవలే ఫ్లిప్‌కార్ట్ లో ఫోన్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి సబ్బులు వచ్చిన విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరో వ్యక్తి సాక్సులు ఆర్డర్ చేస్తే బ్రా పంపి షాక్ ఇచ్చారు. వీటిని మరిచిపోక ముందే అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది.

కేరళలోని కొచ్చికి చెందిన నూరుల్‌ అమీన్‌ అనే వ్యక్తి రూ.70వేల 900ల ఖరీదు చేసే ఐఫోన్‌ 12ను అమెజాన్‌లో అక్టోబర్‌ 12న ఆర్డర్‌ చేశాడు. అమెజాన్‌ పే కార్డ్‌తో బిల్‌ కూడా కట్టేశాడు. అక్టోబర్‌ 15న ఆర్డర్‌ ప్యాక్‌ వచ్చింది. ఉత్సాహంతో తెరిచాడు.. తీరా చూస్తే షాక్ అయ్యాడు. లోపల అంట్లు తోమే సోప్ (డిష్ వాష్ బార్)‌, 5 రూపాయల కాయిన్‌ ఉన్నాయట. దీంతో బాధితుడు సైబర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

మరింత ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. నూరుల్‌ ఆర్డర్‌ చేసిన ఐఫోన్‌ను అప్పటికే జార్ఖండ్‌కి చెందిన ఓ వ్యక్తి సెప్టెంబర్‌ నుంచి వినియోగిస్తున్నాడనే విస్తుపోయే వాస్తవం బయటపడింది. దీంతో సైబర్‌ పోలీసులు అమెజాన్‌ అధికారులను సంప్రదించగా.. సెప్టెంబర్‌ 25 నుండి జార్ఖండ్‌లో ఈ ఫోన్ వాడుకలో ఉందని, నూరుల్‌ నుంచి అక్టోబర్‌లో ఆర్డర్ వచ్చింది కానీ అప్పటికే స్టాక్ అయిపోయిందని, అతను చెల్లించిన మొత్తం తిరిగి ఇచ్చేస్తామని చెప్పారట.

తనకు ఎదురైన ఈ వింత సంఘటనను నూరుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఆ వెంటనే అది వైరల్‌ అయ్యింది. ఐఫోన్ బదులుగా ఆకుపచ్చ రంగు విమ్ డిష్ వాష్ సబ్బు, రూ.5 నాణెం కనిపించే ఒక చిత్రం కూడా సోషల్ మీడియా సైట్లలో చక్కర్లు కొడుతోంది. కాగా ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువులకు బదులు ఇటుకలు, సబ్బులు రావడం కామన్ అయిపోయింది. సో, ఈ కామర్స్ సైట్స్ లో ఏదైనా ఆర్డర్ చేసే ముందు జాగ్రత్త పడాల్సిందే.

Laptops Online: అద్భుతమైన ఆఫర్లలో ల్యాప్‌టాప్స్.. అమెజాన్‌లో బెస్ట్ డీల్స్ ఇవే!

కొన్ని ఈ కామర్స్ సంస్థలు మరీ టూ మచ్ గా వ్యవహరిస్తున్నాయి. ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరొకటి పంపడమే కాదు.. అదేంటని అడిగితే… సరైన రెస్పాన్స్ ఉండదు. ఆర్డర్ తీసుకునే ముందు ఉండే ఉత్సాహం, చూపించే గౌరవం…. ఆ తర్వాత ఉండవు. ఆర్డర్ సేల్ అయిపోయాక.. నువ్వెవరు అన్నట్లు వ్యవహరిస్తున్నాయి కొన్ని సంస్థలు.

ఏది ఏమైనా కస్టమర్లు ఇలాంటి ఖరీదైన ఆర్డర్లు చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మీరు కూడా ఇలాంటి ఖరీదైన ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తే పార్శిల్ రాగానే హడావుడిగా ఓపెన్ చేయకుండా, పార్శిల్ ఓపెన్ చేసేప్పుడు వీడియో రికార్డ్ చేయాలి. వీడియో రికార్డ్ చేసేప్పుడు పార్శిల్‌పైన ఉన్న బిల్, ఇన్‌వాయిస్ వివరాలు కూడా వీడియోలో రికార్డ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ మీరు ఆర్డర్ చేసిన ప్రొడక్ట్ కాకుండా వేరే ప్రొడక్ట్ వస్తే మీ దగ్గర వీడియో సాక్ష్యం ఉంటుంది. అవసరమైతే డెలివరీ చేసిన వ్యక్తి ముందే పార్శిల్ ఓపెన్ చేయండి.