Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

గాజు మెటీరియల్ కి ఎలాంటి రుచి ఉండదు. ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ అయితే రుచి మారిపోతుంది. కానీ గాజు గ్లాసులో నీళ్ళు పోసుకుని తాగడం వల్ల రుచి మారదు.

Glass Water : గాజు గ్లాసులో వాటర్ తాగితే ఆరోగ్యానికి మంచిదా?..

Glass

Glass Water : నీళ్ళు ఆరోగ్యానికి చాలా అవసరమైనవి. అనారోగ్య సమస్యలు రాకుండా నీళ్లు శరీరాన్ని రక్షిస్తాయి. శరీరానికి సరిపడా నీళ్ళు తాగాలి. కనీసం ప్రతి ఒక్కరూ రోజుకు ఎనిమిది గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. సరిపడా నీళ్లు తీసుకోకపోవడం వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. మంచి నీటిని ఎక్కువగా తాగమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.. మంచి నీటిని తాగటం ఒక ఎత్తయితే ఆ నీటిని ఎందులో పోసుకుని తాగుతున్నామనే విషయం తెలుసుకోవటం కూడా ముఖ్యమే… చాలా మంది ప్లాస్టిక్ బాటిల్స్ లో నీటిని తాగుతున్నారు.. ఇది ఆరోగ్యానికి అస్సలు మంచిదికాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనేపధ్యంలో గాజు గ్లాసులో నీటిని తాగడం సురక్షితంగా చెబుతున్నారు.

చాలా మంచిది మంచినీటిని ప్లాస్టిక్ బాటిల్స్ లో పోసుకుని తాగటం అలవాటైపోయింది. అయితే ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ లో అనేక రకాల ప్లాస్టిక్ ను ఉపయోగిస్తారు. ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. అదే గాజు సీసాలో నీరు నిల్వ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది. గాజు సీసాలో పోసుకుని ఉంచితే ఆ నీరు రోజంతా ఫ్రెష్ గా ఉంటాయి. పైగా వాటి రుచి కానీ వాసన కానీ మారదు. అదే ప్లాస్టిక్ బాటిల్స్ లో నిల్వ ఉంచితే ప్లాస్టిక్ లో ఉండే హానికర రసాయనల వలన నీటి రుచి మారుతుంది.

గాజు మెటీరియల్ కి ఎలాంటి రుచి ఉండదు. ప్లాస్టిక్ కానీ మెటల్ కానీ అయితే రుచి మారిపోతుంది. కానీ గాజు గ్లాసులో నీళ్ళు పోసుకుని తాగడం వల్ల రుచి మారదు. సాధారణంగా బాటిల్స్ ని తయారు చేసేటప్పుడు వివిధ రకాల కెమికల్స్ ని వాడతారు. కానీ గాజు బాటిల్ లో ఎలాంటి కెమికల్స్ ఉండవు దీనితో రుచి కానీ వాసన కానీ మారదు.

ఇంకా గాజు గ్లాసులో నీళ్లు పోసుకుని తాగితే వాటిలో ఉన్న నలకలు సులువుగా కనపడతాయి. వీటిని శుభ్రం చేసుకోవటం కూడా సులువు. గాజు గ్లాసులో వేడి నీటి పోసి ఎంత సేపు ఉన్న వాటి సంద్రత కొల్పోదు. గాజు సీసాలో నీటిని ఎన్ని రోజులు స్టోర్ చేసిన వాటి వాసన , రుచి పోదు. పైగా ఇందులో నీటిని తాగితే ఎత్తి పోసుకోలెం.. దీనివలన శరీరంలోకి ఎటువంటి గాలి వెళ్లకుండా ఉంటుంది. గాజు గ్లాసును సిప్ చేసి తాగటం వలన దేహం లోకి గాలి వెళ్లకుండా పొట్ట రాకుండా చేస్తుంది.. తెలుసుకున్నారు కదా గాజు గాస్లు లో నీటిని తాగండి. ఈ ప్రయోజనాలను మీరు పొందండి.