రాపాకకు వైసీపీ క్షమాపణలు చెప్పాలి – పవన్ కళ్యాణ్

  • Publish Date - December 13, 2019 / 09:30 AM IST

తప్పుడు వార్తలు ప్రచురించినందుకు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు వైసీపీ మద్దతు దారులు క్షమాపణలు చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. జనసేనపై దుష్ప్రచారాలు మానుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు ఆయన..2019, డిసెంబర్ 13వ తేదీ శుక్రవారం ట్విట్టర్‌ వేదికగా ట్వీట్ చేశారు. తాము డిసెంబర్ 12వ తేదీ గురువారం రైతు సౌభాగ్య దీక్షలో ఉంటే..

అసెంబ్లీలో ఉన్న రాపాకకు పార్టీ షోకాజ్ నోటీసు జారీ చేశామని ముందుగా..వైసీపీ సంబంధిత వైబ్ సైట్‌లో రావడం చూస్తుంటే..ఎవరు చేయించారో అర్థమౌతుందని తెలిపారు. దీనిని నియోజకవర్గ ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. అంతేగాకుండా..రాపాకను అరెస్టు చేసి బెయిల్ రానివ్వకుండా వైసీపీ నాయకులు ప్రయత్నిస్తే..స్వయంగా రంగంలోకి తాను దిగితే..వారు వెనక్కి తగ్గారన్న సంగతి నియోజకవర్గ ప్రజలు అందరూ జ్ఞాపకం చేసుకోవాలని సూచించారు పవన్. రాపాకకు క్షమాపణలు చెప్పాలన్నారు. 

Read More : దిశ చట్టం : వైసీపీ నేతలపై యాక్షన్ తీసుకోవాలి – బాబు
* డిసెంబర్ 12వ తేదీ గురువారం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కాకినాడలో రైతు సౌభాగ్య దీక్ష పేరిట ఒక రోజు దీక్ష చేశారు. 
* కానీ ఈ దీక్షకు జనసేన ఎమ్మెల్యే రాపాక హాజరు కాకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
* దీంతో ఆయనకు పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేస్తుందనే ప్రచారం జరిగింది. 
* ఇటీవలే..ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం అంశంపై సీఎం జగన్‌పై రాపాక ప్రశంసలు కురిపించారు. 
* వైసీపీపై పవన్ విమర్శలు చేస్తుంటే..రాపాక వ్యవహారిస్తున్న తీరు చర్చనీయాంశమవుతోంది. 
* తాజాగా పవన్ చేసిన ట్వీట్‌పై వైసీపీ నేతలు, రాపాక ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి.