Pawan Kalyan: పవన్ కల్యాణ్‌పై కేసులు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి.. ఏయే సెక్షన్ల కింద అంటే?

మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు.

Pawan Kalyan

Pawan Kalyan – JanaSena: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా సంచలన వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆయనపై కేసులు పెట్టడానికి వైసీపీ (YCP) సర్కారు అనుమతి ఇచ్చింది. సీసీపీ 199/4 ప్రకారం పవన్ పై కేసుల నమోదుకు అనుమతిస్తూ, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లను ఆదేశిస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది.

పరువు నష్టం కేసులు పెట్టాలని చెప్పింది. గ్రామవార్డు వాలంటీర్లు, సచివాలయాల శాఖ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయి. పవన్ చేసిన వ్యాఖ్యలపై వివిధ పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తల ఆధారంగా కేసులు నమోదు చేయాలని చెప్పింది. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి నోటీసులు పంపారు.

ఏపీలో వారాహి విజయ యాత్ర నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్ వాలంటీర్లపై అనేక ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఏపీలో మహిళలు అదృశ్యమవుతున్నారని పవన్ అన్నారు. వాలంటీర్లు డేటా సేకరిస్తున్నారని, అదంతా ఎవరికి చేరుతుందని ప్రశ్నించారు. ఇప్పటికే పవన్ పై కొన్ని పోలీస్ స్టేషన్లలో వాలంటీర్లు ఫిర్యాదు చేశారు. వాలంటీర్ సురేశ్ ఇటీవల చేసిన ఫిర్యాదు మేరకు విజయవాడలోని కృష్ణలంక పోలీసులు సెక్షన్ 153, 153ఏ, 505(2) ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

పవన్‌కు అందిన నోటీసులు ఇవే..


Notice


Notice

Pawan Kalyan : ప్రజల డబ్బులు దోచేస్తారు- మరోసారి వాలంటీర్లపై పవన్ సంచలన వ్యాఖ్యలు