Pawan Kalyan : బీజేపీ ఈ పొజిషన్‌కి రావడానికి 20ఏళ్లు పట్టింది- పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుంది.

Pawan Kalyan : జనసేన క్రియాశీల సభ్యులు, వీర మహిళల శిక్షణా తరగతుల అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అప్పుడు ప్రజల కోసం 80లలో టీడీపీ వచ్చింది, తెలంగాణలో ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ పుట్టింది అని పవన్ అన్నారు. 2019లో జనసేన ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిందన్న పవన్.. నీ పార్టీ, నీ సిద్దాంతాలు వర్కౌట్ కావు అని కొంతమంది కామెంట్లు చేశారని చెప్పారు.

బీజేపీ ఇప్పుడున్న పొజిషన్ కి రావడానికి 15 నుండి 20 సంవత్సారాలు పట్టిందని పవన్ గుర్తు చేశారు. రెండు పార్లమెంట్ సీట్ల కోసం సుదీర్ఘంగా పని చేసిందని.. వాజ్ పేయి, అద్వానీ పార్లమెంటులో తమ వాణి వినిపిస్తూ ఎంతో కష్టపడ్డారని పవన్ గుర్తు చేశారు. అలాంటిది.. ఈరోజు ఏ పార్టీ సపోర్ట్ అక్కర్లేని విధంగా బీజేపీ ఓ పొజిషన్ కు ఎదిగిందన్నారు. చిన్న బిల్డింగ్ కూడా పునాదులు వేసుకుంటూ పెద్దదవుతుందన్నారు పవన్.

Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?

”ఏ ప్రారంభమైనా చిన్నగానే మొదలవుతుంది. జనసేన కూడా అలానే మొదలైంది. నాకు ఆశలు లేవు.. ఆశయం మాత్రం ఉంది. అవినీతిపై పోరాటం రాజకీయాల్లో కొత్తకాదు. స్త్రీ శక్తి మీ రూపంలో జనసేనకి ఉంది. నిర్మాణాత్మకంగా పోరాటం చేద్దాం. కాంగ్రెస్, బీజేపీ లాంటి భారీ ఫండ్స్ ఉన్న పార్టీలు మార్చలేము అనుకున్నపుడు.. ఆమ్ ఆద్మీ వచ్చింది. కేజ్రీవాల్ లాంటి లీడర్లు వచ్చారు. ఇలాంటివి మనం విస్మరించకూడదు. మార్పుని చూడాలి.

Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్

ఏపీని అడ్డగోలుగా దోచేస్తున్న ఏ పార్టీనైనా జనసేన ఎదుర్కొంటుంది. కౌలు రైతులకు ఇస్తానన్న డబ్బు ఎక్కడికి వెళ్తున్నాయో తెలియట్లేదు. వైసీపీ మద్యపాన నిషేధం అంటూనే.. లేని బ్రాండులు కూడా తెచ్చింది. నెలకు అక్రమంగా రూ.250 కోట్లు వైసీపీ నాయకుల వ్యక్తిగత సంపాదన అని చాలామంది చెబుతున్నారు. వైన్ షాప్స్ లో అంతా క్యాష్ రూపంలోనే తీసుకుంటున్నారు. చట్టసభల్లో కూర్చున్న వారికి మాకు ఒకే చట్టాలు వర్తిస్తాయని మర్చిపోవద్దు. జనసేన పోరాటం చేస్తూ ముందుకెళ్తుంది” అని పవన్ అన్నారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ట్రెండింగ్ వార్తలు