Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?

జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా ఉన్న ఉపాధి కూడా పోయింది. మరి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?

Nadendla Manohar : ఏపీకి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎలా వచ్చింది?

Nadendla Manohar

Nadendla Manohar : జనవాణి జనసేన భరోసా కార్యక్రమంతో ప్రభుత్వంలో చలనం వస్తుందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. పవన్ కళ్యాణ్ ద్వారా ప్రజా సమస్యలను ప్రభుత్వానికి వివరిస్తామన్నారాయన. అనేక సమస్యలున్నా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. వైఎస్ఆర్ కూడా ప్రజలను కలిసి వారి సమస్యలను వినేవారని గుర్తు చేసిన నాదెండ్ల మనోహర్.. జగన్ మాత్రం తాడేపల్లి ప్యాలెస్ దాటి బయటకి రావడం లేదన్నారు.

కనీసం జిల్లా పర్యటనలో ప్రజల గోడు జగన్ కి పట్టదన్నారు. అనేక ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ని కలిసి ప్రజలు సమస్యలను విన్నవించారని చెప్పారు. జగన్ కనీసం తాను ఉంటున్న అమరావతి ప్రాంతంలో ప్రజల బాధలు కూడా పట్టించుకోలేదన్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుని భరోసా నింపాలనే పవన్ కళ్యాణ్ జనవాణి చేపట్టారని నాదెండ్ల మనోహర్ తెలిపారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

”ఈ నెల 3, 10 తేదీలలో విజయవాడ ఎం.బి.కె భవన్ లో జనవాణి జరుగుతుంది. పవన్ కళ్యాణ్ నేరుగా ప్రజల నుండి అర్జీలు స్వీకరిస్తారు. ప్రజలు తమ సమస్యలు చెప్పి, ఎక్ నాలెడ్జ్ మెంట్ తీసుకోవాలి. ఈ సమస్యలు, పత్రాలను సంబంధిత అధికారులు దృష్టికి పంపి పరిష్కారం కోసం మా టీం పని చేస్తుంది. పల్లెలు, పట్టణాల్లో వైసీపీ నేతలు సమస్యలను పట్టించుకోవడం లేదు. ఎక్కడ చూసినా తమ గోడు వినే వారు లేక ప్రజలు కన్నీరు పెడుతున్నారు. విజయవాడతో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా జనవాణి జరుగుతుంది” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.

ఇక ఏపీకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు రావడంపై నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అవార్డు ఎవరికి, ఎలా వచ్చింది అని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ”జగన్ మూడేళ్ల పాలనలో ఒక్క పరిశ్రమ కూడా ఏపీకి రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చాక ఉపాధి లేకపోగా ఉన్న ఉపాధి కూడా పోయింది.

Vangaveeti Radha Janasena : జనసేనలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలపై వంగవీటి రాధ క్లారిటీ

కియా మోటార్స్ కి ఏపీఐఐసీ 63 ఎకరాల స్థలం ఎలా ఇచ్చారు? కియా సైంటిఫిక్ ప్రాసెస్ కు ఏ రూల్ ప్రకారం ఇచ్చారో చెప్పాలి? నిజంగా కియా పరిశ్రమ అక్కడ పెడుతున్నారా? మీడియా సాక్షిగా డిమాండ్ చేస్తున్నా. సమాధానం చెప్పాలి. జులై 15 తర్వాత రోడ్ల దుస్థితిపై జనసేన మళ్లీ క్యాంపైనింగ్ చేపడుతుంది. గతంలో సోషల్ మీడియా ద్వారా రోడ్ల పరిస్థితి వివరించాం. జగన్ తన మాటకు కట్టుబడితే మా సవాల్ స్వీకరించాలి.

మేము విజయవాడ లో మూడు హాల్స్ ను చూశాం. వాటిని ఇవ్వనివ్వకుండా వైసీపీ నాయకులు అడ్డు పడ్డారు. జనసేన సభకు ఇస్తే ఊరుకోమని హెచ్చరించారు. కామ్రేడ్స్ మాకు హాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు. గడప గడపకు వెళ్లిన నాయకులను ప్రజలు నిలదీస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలు కూడా తీసుకోకుండా వెళ్లి పోతున్నారు. ప్రశ్నిస్తే పథకాలు తీసేస్తామని వాలంటీర్లతో బెదిరిస్తున్నారు. సమాధానం చెప్పలేని ఎమ్మెల్యేలకు పదవులు ఎందుకు?

Sambasiva Rao : సీఐడీ పోలీసులు నా బట్టలిప్పించారు, చిత్రహింసలు పెట్టారు- చంద్రబాబుతో వాపోయిన సాంబశివరావు

అమరావతి రైతులను జగన్ ఎలా మోసం చేశాడో అందరికీ తెలుసు. ఇప్పుడు అక్కడి భూములు అమ్ముతామనడం జగన్ నైజాన్ని తెలియ చేస్తుంది. మా దృష్టికి వచ్చే సమస్యలు ప్రభుత్వానికి, అధికారులకు వివరిస్తాం. ప్రజా ప్రతినిధులు ఎవరికీ అందుబాటులో లేరు. అందుకే పవన్ కళ్యాణ్ ప్రజలకు అండగా ఉండేందుకు జనవాణి చేపట్టారు. జగన్ సొంత అమ్మమ్మ ఊరిలో కౌలు రైతులు చనిపోయారు. పవన్ కళ్యాణ్ లక్ష సాయం చేశాక.. ప్రభుత్వం కూడా లక్ష ఇచ్చింది.

కౌలు రైతులు ఆత్మహత్య చేసుకోలేదని జగన్ ఎలా చెబుతారు? 74 మంది రైతు కుటుంబాలకు పవన్ సాయం చేశారు. అటువంటి సభలకు జగన్ కావాలి.. వాస్తవాలు గుర్తించాలి. పోలీసుల ఎఫ్.ఐ.ఆర్ ద్వారా సమాచారం తీసుకుని సాయం చేస్తున్నాం. సీఎం జగన్ రైతులను అవమానించేలా మాట్లాడొద్దు. ప్రజలు, రైతులకు మంచి చేసేలా జగన్ వ్యవహరిస్తే.. జనసేన స్వాగతిస్తుంది, సహకరిస్తుంది” అని నాదెండ్ల మనోహర్ అన్నారు.