Sambasiva Rao : సీఐడీ పోలీసులు నా బట్టలిప్పించారు, చిత్రహింసలు పెట్టారు- చంద్రబాబుతో వాపోయిన సాంబశివరావు

కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం పోలీసులు గుండెల మీద తన్నారని తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని పోలీసులు బెదిరించారని వాపోయారు.(Sambasiva Rao)

Sambasiva Rao : సీఐడీ పోలీసులు నా బట్టలిప్పించారు, చిత్రహింసలు పెట్టారు- చంద్రబాబుతో వాపోయిన సాంబశివరావు

Chandrababu Naidu (1)

Sambasiva Rao : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లో సోషల్ మీడియా యాక్టివిస్ట్, టీడీపీ కార్యకర్త సాంబశివరావు తన బాధను పంచుకున్నారు. సీఐడీ పోలీసులు తన ఇంటికి వచ్చారని, దుర్భాషలాడుతూ అరెస్ట్ చేశారని సాంబశివరావు చంద్రబాబుతో వాపోయారు. పోలీసులు తన బెడ్ రూములోకి దూరి అరెస్ట్ చేశారని చెప్పారు. స్టేషన్ కు తీసుకెళ్లి బట్టలిప్పించారని, చిత్రహింసలకు గురి చేశారని చంద్రబాబుతో చెప్పారు.

Chandrababu Warning : వచ్చేది నేనే.. తప్పుడు అధికారులను వదలను- చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

కంప్యూటర్ పాస్ వర్డ్ కోసం పోలీసులు తన గుండెల మీద తన్నారని సాంబశివరావు తెలిపారు. కాపు సామాజిక వర్గానికి చెందిన నువ్వు ఈ పార్టీకి ఎలా పని చేస్తున్నావని పోలీసులు నన్ను బెదిరించారని సాంబశివరావు వాపోయారు. తనకు 41ఏ నోటీసులు ఇచ్చారని, స్టేషన్ నుంచి బయటకు పంపుతూ విచారణ జరుగుతోందని చెప్పమన్నారని తెలిపారు. పెద్దొళ్లతో పెట్టుకుంటున్నావ్, కొట్టినట్టు చెబితే మళ్లీ కేసులు పెడతామని తనకు పోలీసులు వార్నింగ్ ఇచ్చారని చంద్రబాబుతో సాంబశివరావు వాపోయారు.

Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

సోషల్‌ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారన్న నెపంతో సామాన్యులపై సీఐడీ అధికారుల దౌర్జన్యం చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారనే అభియోగంపై పల్నాడు జిల్లాకు చెందిన టీడీపీ కార్యకర్త, యూట్యూబర్‌ గార్లపాటి వెంకటేశ్‌ ను, మంగళగిరిలో టీడీపీ కార్యకర్త సాంబశివరావును బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఇరువురిని గుంటూరులోని సీఐడీ ప్రాంతీయ కార్యాలయానికి తరలించి ఉదయం నుంచి రాత్రి వరకు విచారణ పేరుతో కార్యాలయంలోనే ఉంచారు. కనీసం వారిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో కూడా చెప్పకపోవడం, వారి న్యాయవాదులకు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా ఇవ్వకపోవటంతో టీడీపీ నాయకులు సీఐడీ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

ఫోర్జరీ డాక్యుమెంట్ ను ఫార్వర్డ్‌ చేసిన కేసులో నోటీసు ఇచ్చేందుకు సీఐడీ అధికారులు వెళ్లగా వెంకటేశ్‌, ఆయన కుటుంబ సభ్యులు తమ విధులకు ఆటంకం కలిగించారని సీఐడీ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సాంబశివరావుకు 41ఎ నోటీసు ఇచ్చి పంపుతున్నామని, వెంకటేశ్‌ను మాత్రం మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచనున్నామని సీఐడీ అధికారులు ప్రకటించారు. సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌ పెడితే 41ఎ నోటీసు ఇచ్చి విచారణకు పిలవాలే కానీ చట్టవిరుద్ధంగా ఇళ్లలోకి అక్రమంగా ప్రవేశించి అదుపులోకి తీసుకున్నారని టీడీపీ లీగల్‌ సెల్‌ న్యాయవాదులు ఆరోపించారు. వెంకటేశ్‌ అరెస్టులో పాల్గొన్న సీఐడీ పోలీసులందరూ శిక్షార్హులేనని, వారందరిపై ప్రైవేట్‌ కేసు పెడతామని టీడీపీ నేతలు హెచ్చరించారు.

ఏపీలో సీబీసీఐడీ వికృత చేష్టలు పరాకాష్టకు చేరుతున్నాయని చంద్రబాబు మండిపడ్డారు. సుప్రీం నిబంధనలను కూడా పట్టించుకోకుండా సీబీసీఐడీ వ్యవహరిస్తోందన్నారు. కస్టోడియల్ టార్చర్ నుంచి కస్టోడియల్ మర్డర్ చేసేంత వరకు సీఐడీ వ్యవహరిస్తోందన్నారు. ఎంపీ రఘురామకృష్ణ రాజు విషయంలో ప్రభుత్వం ఎన్నో విమర్శలు ఎదుర్కొందన్న చంద్రబాబు.. ప్రభుత్వానికి సిగ్గు ఎగ్గు ఉంటే అప్పుడే రాజీనామా చేసి వెళ్లిపోవాల్సిందన్నారు. సోషల్ మీడియాలో ఎవరైనా ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

సోషల్ మీడియా యాక్టివిస్ట్ వెంకటేష్, సాంబశివరావు వంటి వారి విషయంలో సీబీసీఐడీ అధికారులు వ్యవహరించిన తీరు అమానుషం అన్నారు చంద్రబాబు. టీడీపీ మళ్లీ అధికారంలోకి రాబోయే పార్టీ అని గుర్తుంచుకోవాలని, తప్పుడు అధికారులను వదిలి పెట్టనని చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.