Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

ఇసుకలో దోచేసిన డబ్బుతో హైదరాబాదులో విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మిల్లర్స్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయటానికి లంచాలు బొక్కేశారని ఆరోపించారు.

Kollu Ravindra : మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు

Kollu Ravindra

TDP Kollu Ravindra : ఏపీ మాజీమంత్రులు కొడాలి నాని, పేర్ని నానిపై టీడీపీ నేత కొల్లు రవీంద్ర సంచలన ఆరోపణలు చేశారు. కృష్ణా జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలందరినీ డమ్మీలను చేసి బెదిరించి మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని విపరీతంగా దోచేశారని ఆరోపించారు. సాక్షాత్తు అధికార పార్టీ ఎంపీయే వీరి అవినీతి చిట్టాను బయట పెడుతున్నారని పేర్కొన్నారు. ఇసుకలో దోచేసిన డబ్బుతో హైదరాబాదులో విల్లాలు కడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. కొడాలి నాని పౌరసరఫరాల శాఖ మంత్రిగా పని చేసినప్పుడు మిల్లర్స్ కు రావాల్సిన బకాయిలు విడుదల చేయటానికి లంచాలు బొక్కేశారని ఆరోపించారు.

గతంలో హైదరాబాదులో పట్టుబడిన 70 కోట్లు కొడాలి నానివేనని స్పష్టం చేశారు. శివుడు పేరుతో కొడాలి నాని నడిపిన ఇసుక లారీల వివరాలన్నీ తమ దగ్గర ఉన్నాయని తెలిపారు. పేర్ని నాని కొల్లేరులో ఉన్న అభయారణ్యంలో 600 ఎకరాల చెరువులు తవ్వుకొని బినామీ పేర్లతో సాగు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలోని మహబూబూబ్ నగర్ లో 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. మచిలీపట్నం చుట్టుపక్కల ప్రాంతాల్లో అసైన్డ్ ల్యాండ్ అంటూ రైతులను బెదిరించి బలవంతంగా లాగేసుకుంటున్నారని పేర్కొన్నారు.

Chandrababu Target Kodali Nani : టార్గెట్ కొడాలి నాని.. గుడివాడపై ఫోకస్ పెంచిన చంద్రబాబు.. స్కెచ్ ఇదే

శ్రీకాకుళం జిల్లాలో ఒక ఐరన్ ఓవర్ కంపెనీని స్వాధీనం చేసుకున్నారు.. దాన్ని ఇప్పుడు రూ.100 కోట్లకు బేరం పెట్టారని తెలిపారు. వీరి అక్రమ ఆస్తులకు ఇప్పుడు వారసులని ప్రకటించుకుంటూ ఉన్నారని పేర్కొన్నారు. బినామీ పేర్లతో వీరి అక్రమాస్తులన్నీ ఉన్నాయని తెలిపారు. త్వరలో వీరి అవినీతి మొత్తాన్ని ఆధారాలతో సహా ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నానని పేర్కొన్నారు. తెలుగు దేశం పార్టీని విమర్శించే స్థాయి ఉందా అంటూ కొడాలి నాని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు.

మాజీమంత్రి పేర్ని నాని పోతేపల్లి పొట్లపాలెం ప్రాంతంలో వందల ఎకరాలు దోచుకుని మట్టి మాఫియాకి తరలింపు చేస్తూ, పేద ప్రజలను మోసం చేస్తూ గోడలు నిర్మించింది వాస్తవం కాదా అని నిలదీశారు. మచిలీపట్నం రైతులను మోసం చేసి నేషనల్ కాలేజీ దగ్గర స్థలాలు కబ్జా చేసి మంగలేరు శివారు ప్రాంతాల్లో నీ అనుచరుల ద్వారా మట్టి వ్యాపారం చేసి కోట్లు సంపాదించిన విషయం ఎవరి దగ్గర దాచి ప్రజలని మోసం చేస్తావని ప్రశ్నించారు.