Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్

తల్లిబిడ్డల మధ్యే అభిప్రాయ బేధాలు వస్తుంటాయి.. అది సహజం అన్నారు. ఒకరి భాష, యాసను అందరూ గౌరవించాలని సూచించారు.

Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు..కలిపే విధానం ఉండాలి : పవన్ కళ్యాణ్

Pawan Kalyan : కులాలను విడగొట్టడం కాదు.. కలిపే విధానం ఉండాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన ఆఫీస్ లో శనివారం(జులై2,2022) నిర్వహించిన వీర మహిళలకు శిక్షణ తరగతులకు హాజరైన పవన్ మాట్లాడుతూ భిన్న ప్రాంతాల నుంచి వచ్చిన వారు ఒకేలా ఆలోచించడం కష్టం అని తెలిపారు.

అభిప్రాయ బేధాలు ఉండటం సహజం అన్నారు. తల్లిబిడ్డల మధ్యే అభిప్రాయ బేధాలు వస్తుంటాయి.. అది సహజం అన్నారు. ఒకరి భాష, యాసను అందరూ గౌరవించాలని సూచించారు.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

ప్రాంతీయతను విస్మరించని జాతీయ భావం ఉండాలన్నారు. అవినీతిపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని చెప్పారు. జరుగుతున్న విధ్వంసాన్ని గుర్తించి సరిదిద్దుకోవాలన్నారు.