Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

సముద్రం ఎక్కువుగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా, కృష్ణ నది ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ అని పెట్టారు.. పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలన్నారు. మే18న నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలకు 30 రోజులు సమయం ఇవ్వడం అంటే ప్రభుత్వానికి గొడవలు జరగాలనే ఉద్దేశ్యం ఉందని పేర్కొన్నారు.

Pawan Kalyan : కోనసీమ జిల్లా పేరు మార్పుపై పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan

Pawan Kalyan : కోనసీమ జిల్లాను డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడం పట్ల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 4 న అన్నీ జిల్లాలు ప్రకటించి కోనసీమ జిల్లా అని పెట్టి ఉంటే ఈ పరిస్థితి వొచ్చి ఉండేది కాదు..కావాలనే జాప్యం చేశారని విమర్శించారు. జనసేనగా తాము దీన్ని అభినందించబోమని చెప్పారు. రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినప్పుడు కడపకి ఆయన పేరు పెట్టారు.. నెల్లూరుకు పొట్టి శ్రీరాములు జిల్లాగా పెరు పెట్టారని గుర్తు చేశారు. ప్రభుత్వ విధానాంపై చర్చ జరుగుతుందన్నారు.

వైసీపీ ప్రభుత్వపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. సముద్రం ఎక్కువుగా ఉన్న ప్రాంతానికి కృష్ణా జిల్లా, కృష్ణ నది ఎక్కువుగా ఉన్న ప్రాంతాల్లో ఎన్టీఆర్ అని పెట్టారు.. పేర్లు పెట్టేటప్పుడు ఆలోచించి పెట్టాలన్నారు. మే18న నోటిఫికేషన్ జారీ చేసి అభ్యంతరాలకు 30 రోజులు సమయం ఇవ్వడం అంటే ప్రభుత్వానికి గొడవలు జరగాలనే ఉద్దేశ్యం ఉందని పేర్కొన్నారు. బీసీ, మాల, మాదిగ, మత్యకర ఉపకులాలు, క్షత్రియులు, కాపులు ఒకరికొకరు సహకరించుకుంటారని తెలిపారు.

Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లాగా మార్పు

అభ్యంతరాలు ఉంటే వ్యక్తిగతంగా రావాలి కానీ, సామూహికంగా రాకూడదని పెట్టడం అంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం కోసమేనని జనసేన అభిప్రాయ పడుతుందని చెప్పారు. 30రోజులు టైం ఇచ్చి విద్వేషాలు రెచ్చ గొట్టారు..మంత్రి ఇంట్లో దాడి జరిగితే చోద్యం చూశారని విమర్శించారు. తాను కాకినాడ వెళ్తే పోలీసులు..జిల్లా మొత్తం 141 సెక్షన్ అమలు చేశార..కానీ అమలాపురంలో ఏం చేశారని ప్రశ్నించారు. చాలా పద్ధతిగా జరిగిందన్నారు.

గతంలో జరిగిన ఘటనలో కూడా వైసీపీ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. గొడవలు అడ్డుకోవాల్సింది పోయి తాము చేశామని చెప్పడం దారుణం అన్నారు. వైసీపీ MLC మూడు రోజుల క్రితం డ్రైవర్ ని చంపెశారని ఆరోపించారు. కడపలో ఏదో ఒక జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టి ఉండొచ్చుగా అని ప్రశ్నించారు. కుల సమీకరణలపై రాజకీయం చేస్తుందని మండిపడ్డారు. తాను ఆంద్రుడు అనే అభిప్రాయం కూడా పోగొడుతుందన్నారు.
Konaseema : నివురుగప్పిన నిప్పులా కోనసీమ

దళిత ముఖ్యమంత్రి అయిన దామోదరం సంజీవయ్య పేరు కర్నూలుకు పెట్టాలని పవన్ కళ్యాణ్ కోరారు. భవిష్యత్ లో తాము అధికారంలోకి వచ్చినపుడు రెఫరెండం పెడతానని చెప్పారు. 30 రోజులు టైం ఇచ్చి వ్యక్తులుగా రమ్మంటున్నారు అంటే గొడవలు కోరుకొంటున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఎస్ సీ సబ్ ప్లాన్ కోరుకున్నారు.. వైసీపీకి అంబేద్కర్ మీద గౌరవం ఉంటే దాన్ని అమలు చేయాలని సవాల్ చేశారు.