Shiva Shankar - Janasena (Photo : Google)
Shiva Shankar – Janasena : శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలో జనసేన కార్యకర్తల సమావేశంలో జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొత్తుల గురించి ఆయన హట్ కామెంట్స్ చేశారు. పొత్తుల విషయంలో ఎవరెవరు కలిస్తే ఏమవుతుందో అనే భవిష్యవాణి సీపీఐ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీపీఐ నేత రామృష్ణ వాళ్ల పార్టీపై దృష్టిని కేంద్రీకరించాలని సలహా ఇచ్చారు.
పొత్తులపై ఇప్పటం సభలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన వైఖరి తెలిపారని శివశంకర్ చెప్పారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలనివ్వను అని పవన్ కల్యాణ్ అన్న మాట స్వార్ధంతో కాదని శివశంకర్ స్పష్టం చేశారు. పొత్తుల విషయంలో కమ్యూనిస్టుల సలహాలు మాకు అవసరం లేదని ఆయన తేల్చి చెప్పారు.
Also Read..Nagari Constituency: నగరిలో ఇన్ని సవాళ్ల మధ్య మంత్రి రోజా ఎలా నెగ్గుకువస్తారో!?
‘పవన్ అత్యంత మేధావి. బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రజా సంక్షేమం కోసం సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో టీం వర్క్ వల్ల మంచి రిజల్ట్ వచ్చింది. అందుకే ఇక్కడ ఫోకస్ చేస్తున్నాం. మా పార్టీ డబ్బుతో రాజకీయం చేసే పార్టీ కాదు. సామాన్యులే మా పార్టీ నేతలు.
Also Read..Dadi Veerabhadra Rao: దాడి వాడి ఎందుకు తగ్గిపోయింది.. మళ్లీ యాక్టివ్ అవుతారా?
శ్రీకాకుళం జిల్లాలో కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. తండ్రి తర్వాత కొడుకు, బావమరిది రాజకీయాలు చేస్తున్నారు. ప్రతీ నియోజకవర్గంలో మఠాదీశుల్లా కుటుంబాలు రాజకీయం చేస్తున్నాయి. అంబేద్కర్ ఆలోచన ప్రకారం రాజకీయ మార్పు కోసమే జనసేన పనిచేస్తుంది” అని శివశంకర్ అన్నారు.