Pawan Kalyan: అందుకే నాకు టీడీపీ పాలనే మంచిదని అనిపిస్తోంది: పవన్ కల్యాణ్

వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలన మంచిదని అనిపించిందని పవన్ కల్యాణ్ చెప్పారు. వాటన్నింటి గురించి వివరించారు..

Pawan Kalyan

Pawan Kalyan – TDP: వైసీపీ (YCP) సర్కారుపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తనకు టీడీపీ (TDP) పాలనే మంచిదని ఇప్పుడు ఎందుకు అనిపిస్తుందో చెప్పారు. తాను ఏపీలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని అంటే కొందరు తనపై ప్రతి దాడి చేశారని చెప్పారు.

ఇవాళ ముగ్గురు అమ్మాయిలు ఒకేరోజు మిస్ అయ్యారని పేపర్లో వచ్చిందని చెప్పారు. తన దగ్గరకు ఇలాంటి ఎన్నో సమస్యల గురించి పిటిషన్లు వచ్చాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం సహజ వనరులను దోచుకుందని చెప్పారు. దీనికి బాధ్యులైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

వచ్చేది జనసేన ప్రభుత్వమయినా, జనసేన-టీడీపీ ప్రభుత్వమయినా సరే, బీజేపీ-జనసేన ప్రభుత్వమైనా సరే వదిలిపెట్టబోమని చెప్పారు. తాను పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని తెలిపారు. అందుకే సీఎంగా చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నానని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థలను అభివృద్ధి చేయాలని అన్నారు.

స్టీల్ ప్లాంట్ విషయంలో రాష్ట్ర సీఎం జగన్ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు. విద్యా వ్యవస్థ ప్రక్షాళన చేయాలని అన్నారు. యువతులు అదృశ్యమైతే స్పందించలేదని అన్నారు. అడ్డగోలు గా ప్రభుత్వ ఆస్తులు దోచుకుంటున్నారని చెప్పారు. వీటన్నింటినీ బేరీజు వేసి చూస్తే టీడీపీ పాలన మంచిదని అనిపించిందని చెప్పారు.

Revanth Reddy: సెక్యూరిటీ లేకుండా కేసీఆర్ అక్కడకు రాగలరా?: రేవంత్ రెడ్డి