Pawan Kalyan-Revanth Reddy: సీఎం రేవంత్‌ రెడ్డికి పవన్ కల్యాణ్ లేఖ.. బాలల భద్రత, పోక్సో చట్టంపై డిమాండ్

Pawan Kalyan - Revanth Reddy: చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు అందించడమే లక్ష్యంగా లేఖలో పవన్ పలు కీలక సూచనలు చేశారు.

Pawan Kalyan Letter to Revanth Reddy regarding the implementation of the POCSO Act

  • రేవంత్‌కు పవన్ కల్యాణ్ లేఖ
  • పోక్సో చట్టం పటిష్ట అమలు
  • నిందితులపై కఠిన నిఘా ప్రతిపాదన

Pawan Kalyan – Revanth Reddy :తెలుగు రాష్ట్రాల్లో బాలల భద్రత, మహిళా రక్షణపై సరికొత్త రాజకీయ చర్చ మొదలైంది. సమాజంలో చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు, చట్టాలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పిల్లలపై లైంగిక నేరాలకు వ్యతిరేకంగా ఉన్న పోక్సో (POCSO) చట్టాన్ని అత్యంత సమర్థవంతంగా అమలు చేయాలంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవన్ కల్యాణ్ ఒక అధికారిక లేఖ రాశారు.

Also Read: డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం.. చేతికట్టుతోనే ఇంటికి.. ఎమోషనల్ పోస్ట్ చేసిన పవన్ భార్య..

త్వరితగతిన దర్యాప్తు.. కఠిన చర్యలకు సూచనలు:

చిన్నారులపై జరుగుతున్న లైంగిక నేరాల కేసుల్లో వేగవంతమైన దర్యాప్తు, త్వరిత న్యాయం అందించడమే లక్ష్యంగా ఈ లేఖలో పవన్(Pawan Letter To Revanth) పలు కీలక సూచనలు చేశారు. ప్రధానంగా కేసు నమోదైన 60 నుంచి 90 రోజుల్లోనే దర్యాప్తు పూర్తి చేసి చార్జ్‌షీట్ దాఖలు చేయాలని కోరారు. పోక్సో కేసుల్లో తక్షణమే ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేయడం తప్పనిసరి చేయాలన్నారు. దర్యాప్తు అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడంతో పాటు వైద్య పరీక్షలు, ఫోరెన్సిక్, డీఎన్ఏ వంటి శాస్త్రీయ సాక్ష్యాల సేకరణను కచ్చితంగా అమలు చేయాలని ప్రతిపాదించారు.

ప్రత్యేక నిఘా, రక్షణ ప్రణాళికల ప్రతిపాదన:

బాధితులను బెదిరించే నిందితులకు బెయిల్ రాకుండా కఠినంగా వ్యవహరించాలని, నేరస్తులపై రౌడీ షీట్లు తెరిచి నిరంతర నిఘా ఉంచాలని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బాధితులకు ప్రత్యేక రక్షణ ప్రణాళికతో పాటు, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ప్రత్యేక ‘పోక్సో మానిటరింగ్ సెల్స్’ ఏర్పాటు చేయాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లు, ప్రార్థనా స్థలాల్లో బాలల భద్రతకు ప్రత్యేక ప్రోటోకాల్స్ తీసుకురావాలన్నారు. ప్రతి చిన్నారికి రక్షణ, న్యాయం కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న చర్యలపై 30 రోజుల్లో నివేదిక సమర్పించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.