Malla Vijay Prasad: వైసీపీ నేత మళ్ల విజయ ప్రసాద్ ఇంట్లో ఈడీ సోదాలు.. కీలక పత్రాలు స్వాధీనం!
Malla Vijay Prasad: వైకాపా నేత మళ్ల విజయ ప్రసాద్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED Raids)జరిపిన మెరుపు దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర కలకలం రేపాయి.
ED Raids YSRCP Leader Malla Vijay Prasad Residence Welfare Group Money Laundering Case
- వైసీపీ నేతపై ఈడీ దాడులు
- ఐదు చోట్ల ఏకకాలంలో సోదాలు
- మూడు వేల కోట్ల అక్రమాలు
Malla Vijay Prasad ED Raids: వైకాపా నేత మళ్ల విజయ ప్రసాద్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు జరిపిన మెరుపు దాడులు ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో తీవ్ర కలకలం రేపాయి. విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్తగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విజయ ప్రసాద్‌కు (Malla Vijay Prasad) చెందిన నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో ఏకకాలంలో ఈ తనిఖీలు కొనసాగాయి. ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు విశాఖలోని ఐదు కీలక ప్రాంతాల్లో ఈడీ బృందాలు జల్లెడ పట్టాయి. ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో ఈ స్థాయిలో సోదాలు నిర్వహించడం రాజకీయ, వ్యాపార వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
వెల్ఫేర్ గ్రూప్ కేసు: రూ. 3 వేల కోట్ల అక్రమాలపై విచారణ:
వెల్ఫేర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మన్‌గా ఉన్న విజయప్రసాద్ డిపాజిటర్లను మోసగించి, భారీ స్థాయిలో ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలపై ఈ విచారణ వేగవంతమైంది. ఈ సంస్థ ద్వారా దాదాపు రూ. 3,000 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ప్రాథమిక సమాచారం వెలువడింది. దాడుల సందర్భంగా స్వాధీనం చేసుకున్న పలు కీలక పత్రాలు, బ్యాంక్ ఖాతాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఈడీ అధికారులు సుదీర్ఘంగా పరిశీలిస్తున్నారు. విచారణ పూర్తయితే ఈ కుంభకోణానికి సంబంధించిన మరిన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చే అవకాశముంది.
