Pawan Kalyan : చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఇరువురి భేటీకి రాజకీయ ప్రాధాన్యత

చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Pawan Kalyan Chandrababu Meeting

Pawan Kalyan Chandrababu Meeting : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. పవన్ కళ్యాణ్ వెంట నాదెండ్ల మనోహర్ ఉన్నారు. చాలా రోజుల తరువాత హైదరాబాద్ లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఇరువురు భేటీ కావడంతో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

హైదరాబాద్ లోని చంద్రబాబు నివాసానికి పవన్ కళ్యాణ్ వెళ్లారు. చంద్రబాబు ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. చంద్రబాబు జైలు నుంచి వచ్చాక ఆయన అనారోగ్యం నేపథ్యంలో ఆయన్ను పరామర్శించెందుకే పవన్ వచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి.

Assembly Elections 2023: 25 మంది అభ్యర్థులతో బీఎస్పీ మూడో జాబితా విడుదల

చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీ గంటన్నర నుంచి కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై చర్చిస్తున్నట్లు సమాచారం. తెలంగాణ ఎన్నికల్లో జనసేనకు టీడీపీ మద్దతు, క్యాడర్ ఓట్లపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఏపీలో టీడీపీ, జనసేన సమన్వయంపై సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం.