Pawan Kalyan : పిఠాపురం నుంచి పవన్ బరిలోకి.. ఈనెల 23నే నామినేషన్..!

Pawan Kalyan : జనసేనాని పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు.

Pawan Kalyan : ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో వేగాన్ని పెంచారు. ఈ నెల 20 నుంచి పవన్ వరుసగా పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో కనీసం రోజుకి 2 సభల్లో పాల్గొనే దిశగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. అంతేకాదు.. బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటీ చేసే నియోజకవర్గాల్లో కూడా పవన్ తన ప్రచారాన్ని వేగవంతం చేయనున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురం నుంచి జనసేనాని బరిలోకి దిగనున్న సంగతి తెలిసిందే.

Read Also : Ambati Rambau : ఏపీ ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారు, గెలుపు ఖాయమైపోయింది- 10టీవీ ఓపెన్ డిబేట్‌లో మంత్రి అంబటి రాంబాబు

ఈ నేపథ్యంలో పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల 23న నామినేషన్ పవన్ దాఖలు చేసేందుకు ముహుర్తం ఖరారు చేసుకున్నారు. పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్‌కు పవన్ స్వయంగా నామినేషన్ పత్రాలను సమర్పించనున్నారు. అదే రోజు సాయంత్రం ఉప్పాడలో పవన్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజున పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలయ్యాయి. అసెంబ్లీ సెగ్మెంట్లకు 197 నామినేషన్ల దాఖలు కాగా, పార్లమెంట్ సెగ్మెంట్లకు 42 నామినేషన్ల దాఖలయ్యాయి. అందులో వైసీపీ, ఎన్డీఏ కూటమి, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు.

Read Also : Bandi Sanjay Kumar : దమ్ముంటే.. బాబర్ పేరుతో జనంలోకి వెళ్లాలి- కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బండి సంజయ్ సవాల్

ట్రెండింగ్ వార్తలు