Pawan Kalyan: పవర్ షేరింగ్.. పొత్తులపై పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
ఓ ఉద్దేశంతోనే మొన్న పొత్తు ప్రకటన చేశానని అన్నారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు.
- T Venkateshwarlu
- Published On : September 16, 2023 / 08:09 PM IST
Pawan Kalyan
Pawan Kalyan – Alliance: బీజేపీతో తాము పొత్తు ప్రకటన చేసిన తరువాత ఎందుకో కానీ కొన్ని కారణాల వల్ల బలంగా ముందుకు వెళ్లలేక పోయామని పవన్ కల్యాణ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన (JanaSena) విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
బీజేపీ, జనసేన నిజంగా బలంగా పనిచేసి ఉంటే ఈపాటికి జగన్ ఇలా ఉండేవారు కాదని తెలిపారు. తాను ఏ నిర్ణయం తీసుకున్నా పబ్లిక్ గా చేస్తానని, ప్రజలకు ఉపయోగపడితేనే తాను నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. ఈ ఉద్దేశంతోనే మొన్న పొత్తు ప్రకటన చేశానని అన్నారు. తాము ఎన్డీఏ నుంచి బయటకు వచ్చే ప్రసక్తే లేదని ప్రకటించారు.
‘గతంలో టీఆర్ఎస్ మనల్ని మద్దతు అడిగింది. ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు. రాజకీయ పార్టీ ఒక్కరోజులో బలంగా తయారవ్వదు. నేను జగన్ ను తక్కువ అంచనా వేయను.. ఆయన బలం ఆయనకు ఉంది.. నా బలం నాకు ఉంది.. పార్టీని బలంగా నాయకత్వంతో తీర్చిదిద్దాలి ’ అని జగన్ అన్నారు. జనసేన అసెంబ్లీలో అడుగుపెడుతుందని, పార్లమెంటుకు కూడా వెళ్లాల్సిన అవసరం ఉందని పవన్ కల్యాణ్ చెప్పారు.
‘వైసీపీ ఒక చీడ, పీడ, దాని నుండి రాష్ట్రాన్ని పూర్తిగా విముక్తి చేయాలి, పొత్తు ఉంది కదా అని వైసీపీ నీ తక్కువ అంచనా వేయకండి, బలంగా నిలబడండి’ అని జనసేన నేతలకు సూచించారు.
గతంలో ఏపీలోని పెనుమాక, భేతపూడి, ఉండవల్లి గ్రామాల్లో భూ సేకరణ చేయొద్దు అంటే చంద్రబాబు నాయుడు తన మాట విన్నారని పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులు అయినా సరే చెప్పిన మాటను చంద్రబాబు ఎంతో కొంత వింటారని చెప్పారు. అందుకే చంద్రబాబుని గౌరవిస్తానని తెలిపారు.
అంతేగానీ, తాను చంద్రబాబుకు అభిమానిని కాదని పవన్ కల్యాణ్ అన్నారు. చంద్రబాబుతో బంధుత్వం లేదని, ఆయనతో విభేదించే అంశాలు చాలా ఉంటాయని తెలిపారు. రాజధానికి 33 వేల ఎకరాలు వద్దు, 5 వేల ఎకరాలు చాలు అని చెప్పానని తెలిపారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది అని చంద్రబాబుని గౌరవిస్తానని చెప్పారు.
ఏపీలో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ అన్నారు. 30 వేల కోట్ల రూపాయలు లిక్కర్ మీద సంపాదించారని, ఇసుక మాఫియా చేశారని తెలిపారు. మడ అడవులు నరికేశారని, గంజాయి సాగులో రాష్ట్రాన్ని నంబర్ 1 స్థానానికి తీసుకెళ్లారని విమర్శించారు.
ఇంకా ఏమన్నారు?
పవర్ షేరింగ్ ద్వారా అసెంబ్లీలోకి జనసేన వెళ్తుంది..
2024లో JSP బలమైన స్థానంలో ఉంటుంది..
Jsp అసెంబ్లీలో అడుగుపెట్టిన రోజు ఏపి దిశ దశ మారుస్తుంది..
పార్లమెంట్ లోనూ jsp ఉంటుంది..
ముందు జగన్ ను ఏపీ నుంచి తరిమేయాలి
టీడీపీ, జనసేన మధ్య పొత్తులు సమన్వయ పరిచే కమిటీకి JSP నుంచి అధ్యక్షుడుగా నాదెండ్ల మనోహర్ ఉంటారు..
నా పక్కన నించున్నారని లోకేశ్, బాలకృష్ణ తక్కువ కాదు..
వైసీపీ ఓడిపోతుందని.. వైసీపీ నేతలు గుర్తు పెట్టుకోండి..
6 నెలల్లో మా ప్రభుత్వం వస్తుంది.. అధికారులు అర్థం చేసుకోండి..
జీ20 సమ్మిట్ ను ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా ఘనంగా నిర్వహించారు
మరోసారి మళ్లీ మోదీ ప్రధాని కావాలని కోరుకుంటున్నాను
మీ పాలనలో దేశం ముందుకు వెళ్తుంది
మీ సారథ్యంలోనే ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నా
Pawan Kalyan: కాలగర్భంలో కలిసిపోతాయి జాగ్రత్త.. ఓడలు బండ్లవుతాయి జగన్: పవన్ కల్యాణ్ హెచ్చరిక
