Pawan Kalyan: టీడీపీతో కొన్ని పాలసీల వరకే విభేదాలు: పవన్ కల్యాణ్ ఆసక్తికర కామెంట్స్

ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని మర్చిపోనని పవన్ కల్యాణ్ అన్నారు.

Pawan Kalyan

Varahi Vijaya Yatra: టీడీపీతో కొన్ని పాలసీల వరకే విభేదాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కృష్ణా జిల్లా పెడనలో ఆయన వారాహి యాత్ర నిర్వహించి మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం టీడీపీ-జనసేన కలిసి పని చేయాలని చెప్పారు. వైసీపీని గద్దె దింపేలా ఓట్లు చిలకుండా అన్ని పార్టీలు కలవాలని చెప్పానని తెలిపారు. 2024 ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి ప్రభుత్వాన్ని స్థాపించబోతుందని అన్నారు.

ఏపీలో సభ పెట్టాలంటే చాలా కష్టపడాల్సి వస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు. రాష్ట్రంలోకి రావాలంటే పాస్ పోర్ట్ చూపించాల్సిన పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. పెడనలో వైసీపీ దాష్టీకంపై జన సైనికులు పోరాటం చేశారని చెప్పారు. ఇక్కడ జనసైనికుల్ని కొట్టించిన వైసీపీ నేతల్ని మర్చిపోనని అన్నారు.

వైసీపీ ప్రభుత్వం రూపాయి పావలా ప్రభుత్వమని ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదా గురించి చింతించి లాభం లేదని, జరగాల్సింది చూడాలని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించిన రోజు మచిలీపట్నం మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకళ్ల నారాయణ గారి మీద దాడి జరిగింది, అది మర్చిపోనని తెలిపారు. వైసీపీ నవరత్నాలకు-జరిగేదానికి పొంతన లేదు, ఓట్లు వేయించుకొడానికి నవరత్నాలు అని మోసం చేశారని తెలిపారు.

నా సినిమా టికెట్ రేట్లు తగ్గించారు..
తన సినిమా వస్తే టికెట్ రేట్లు తగ్గించేశారని పవన్ చెప్పారు. తన పుట్టినరోజు వస్తే ఫ్లెక్సీలు నిషేధించారని, తరవాత ఆ బ్యాన్ ని ఎత్తేశారని తెలిపారు. రాష్ట్రంలో కుల భావన ఎక్కువని, జాతి భావన తక్కువని అన్నారు. తెలంగాణలో జాతి భావన ఎక్కువని తెలిపారు. తనకు పదవి కావాలనుకుంటే 2009లోనే ఎంపీని అయ్యేవాడినని చెప్పారు.

జగన్ కి దమ్ముంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని అన్నారు. అంతేగానీ, తమపై, మాజీ సీఎం చంద్రబాబు పైనా కేసులు పెట్టడం కాదని చెప్పారు. రాజకీయంగా తనకు బలం లేకపోయినా తాను కేంద్ర సర్కారుని రాష్ట్ర ప్రయోజనాల గురించి ధైర్యంగా అడిగానని తెలిపారు.

Balakrishna: టీడీపీ తెలంగాణ నేతలకు బాలకృష్ణ భరోసా.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై ఏమన్నారంటే?

ట్రెండింగ్ వార్తలు