Kottu Satyanarayana : నువ్వు పెయిడ్ ఆర్టిస్టువి.. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావు : పవన్ కళ్యాణ్ పై మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్

అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు.

Kottu Satyanarayana

Minister Kottu Satyanarayana Fire : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఫైర్ అయ్యారు. రాష్ట్ర ముఖ్యమంత్రిని అరే ఒరే అన్న స్థాయికి దిగజారవని మండిపడ్డారు. “నీకు హిందూ ధర్మంపై నమ్మకం లేదు.. నీ తల్లి పూజ చేస్తే నీ తండ్రి సిగరెట్ కాల్చాడని చెప్పావు” అని పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరో పేపర్ మీద రాసిస్తే చదివే పెయిడ్ ఆర్టిస్టు నువ్వు అని ఘాటుగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు కోసం కిరాయికి మాట్లాడుతున్నావని పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి మీడియాతో మాట్లాడారు.

అన్నవరంలో నకిలీ పురోహితులు పవన్ దగ్గరకు వచ్చి చెప్తే పురోహితులను వేలం వేస్తున్నారని నోటికొచ్చినట్టు మాట్లాడారని తెలిపారు. అన్నవరం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్న విషయం పవన్ కు తెలుసా అన్నారు. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి పెళ్లిళ్లు చేసే స్తోమత ఉన్నవారు కూడా స్వామివారి మీద భక్తితో పిల్లలకు అన్నవరంలో వివాహం చేస్తున్నారని పేర్కొన్నారు.
అన్నవరం దళారీ వ్యవస్థను నిర్మూలించేందుకు చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Pawan Kalyan : నా సంపాదన రోజుకి 2 కోట్లు.. వదులుకుని మీ భవిష్యత్ కోసం వచ్చాను.. వారాహి విజయ యాత్రలో పవన్ వ్యాఖ్యలు

అన్నవరంలో వివాహాలు జరిగే తీరును క్రమబద్ధీకరించామని తెలిపారు. వీటి కోసం ప్రత్యేక అధికారిని నియమించామని వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నీచంగా, దిగజారుడుతనంతో మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. చంద్రబాబు లాంటి శని గాణ్ని నెత్తి మీద పెట్టుకుని ఊరేగుతూ నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. చంద్రబాబును వదులుకుంటేనే పవన్ కళ్యాణ్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందన్నారు.