సరికొత్త భారతానికి బలమైన పునాదులు.. వైసీపీ కళ్లు తెరవాలి : బడ్జెట్ పై పవన్

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్

  • Publish Date - February 1, 2020 / 02:35 PM IST

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్

పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్-2020పై జనసేనాని పవన్ కళ్యాణ్ స్పందించారు. బడ్జెట్ పై పవన్ ప్రశంసలు కురిపించారు. వ్యవసాయ రంగానికి కొండ అండనిచ్చేలా బడ్జెట్ ఉందని పవన్ అన్నారు. ఆర్థిక ప్రగతిని ఆకాంక్షిస్తూ, సమాజ శ్రేయన్సును కోరుకునేలా ఉందని కితాబిచ్చారు. ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు పలు అవకాశాలు ఇచ్చేలా బడ్జెట్ ఉందన్నారు. సరికొత్త భారతానికి ఈ బడ్జెట్ బలమైన పునాదులు వేసిందన్నారు. ఆర్థిక మాంద్యం ఉన్నా, కేంద్ర బడ్జెట్ ఆకాంక్షలతో కూడుకుని ఉందన్నారు.

వైసీపీ ప్రభుత్వం విఫలం:
కాగా, ఏపీ ప్రభుత్వంపై పవన్ ఫైర్ అయ్యారు. కేంద్రం నుంచి ఏపీకి నిధులు తీసుకురావడంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందన్నారు. రాజధాని తరలింపు, రద్దులు, కూల్చివేతలపై పెట్టిన దృష్టి.. బడ్జెట్ కేటాయింపులపై జగన్ ప్రభుత్వం పెట్టలేదని విమర్శించారు. వైసీపీ ఇప్పటికైనా కళ్లు తెరవాలని పవన్ అన్నారు.
 

కేంద్ర బడ్జెట్ పై పవన్ స్పందన:
* ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం నెలకొన్న సమయంలో భారత దేశంపై ఎంతో ప్రభావం పడింది
* ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఆకాంక్షలతో కూడుకుంది.
* బలమైన ఆర్థిక ప్రగతిని సాధించేలా బడ్జెట్ ఉంది.
* సామాజిక శ్రేయస్సు కోసం ఏ వర్గాలైతే నిర్లక్ష్యం చేయబడ్డాయో అటువంటి వర్గాలకు అండగా ఉండేలా ఈ బడ్జెట్ ఉంది.

* దాదాపు 15 లక్షల కోట్ల వ్యవసాయ రుణం కల్పించాలన్న ఆశయం, 2 లక్షల 83 వేల కోట్ల నిధుల కేటాయింపు ప్రధానంగా చెప్పుకోవచ్చు.
* 2022కి ప్రతి రైతు ఆదాయం పెంచేలా తీసుకున్న నిర్ణయం నిరాశ, నిస్పృహల్లో ఉన్న రైతాంగానికి మేలు చేసేలా రూపొందింది.
* ఉత్పత్తి రంగానికి, నిర్మాణ రంగానికి సంబంధించి కేటాయించిన నిధులు ఉపాధి కోసం ఎదురుచూస్తున్న యువతకు పలు అవకాశాలు ఇస్తాయి
* ఆదాయ పన్నుకు సంబంధించి 7 శ్లాబుల విధానం సంబంధిత వర్గాలకు ఊరటనిస్తుంది.

* ప్రధాని మోడీ ఆకాంక్షిస్తున్న సరికొత్త భారతావనికి బలమైన పునాదులు ఈ బడ్జెట్ వేసింది.
* ఇలాంటి బడ్జెట్ ఇచ్చి దేశాన్ని పురోగతి వైపు నడిస్తున్న ప్రధానికి, ఆర్థిక శాఖ మంత్రికి జనసేన తరపున కృతజ్ఞతలు.
* రాష్ట్రానికి తగినన్ని నిధులు తీసుకురావడంలో వైసీపీ విఫలమైంది.
* కూల్చివేతలు, రద్దులు, రాజధాని మార్పు, ప్రత్యర్థులను బూతులు తిట్టించడంపై పెట్టిన దృష్టి.. రాష్ట్రానికి అవసరమైన నిధులు పొందడంలో వైసీపీ సర్కార్ విఫలమైంది.
* ఈ బడ్జెట్ లో ఏపీకి నిధులు పొందలేకపోవడం వైసీపీ వైఫల్యమే, ఇప్పటికైనా కళ్లు తెరవాలి.