మరో త్యాగానికి సిద్ధమైన పవన్ కళ్యాణ్..?

  • Publish Date - November 24, 2020 / 02:40 PM IST

pawan kalyan tirupati byelection: తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీ చేయాలన్న జనసేన ఆశలు నెరవేరే సూచనలు కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లానే…. తిరుపతి ఉప ఎన్నికలోనూ పోటీపై జనసేన వెనక్కి తగ్గే పరిస్థితి కనిపిస్తోంది. తిరుపతిలో జనసేన కేడర్ బలంగా ఉందని, తమ పార్టీ అభ్యర్ధికి పోటీ చేసే అవకాశం కల్పించాలని పవన్ కళ్యాణ్‌ బీజేపీ అధిష్టానాన్ని కోరాలని భావించారు. అయితే తిరుపతిలో తమ అభ్యర్ధినే నిలపాలని బీజేపీ భావిస్తోంది. అభ్యర్ధిని ఎంపిక చేయడంతో పాటు ఎన్నికల వ్యూహం రచిస్తోంది.


https://10tv.in/bjp-leader-bandi-sanjay-controvercial-comments-on-patahabasthi/
ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పోటీచేస్తాయని, తిరుపతిలో కాషాయ జెండా రెపరెపలాడుతుందని ఇప్పటికే సోమువీర్రాజు ప్రకటించారు. అయితే జనసేన కూడా తిరుపతిపై ఆసక్తి చూపడంతో సస్పెన్స్ నెలకొంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన భావించగా…బీజేపీ నేతలు సర్ది చెప్పారు. వారి మాటలు విని నగరంలో పోటీపై జనసేన వెనక్కి తగ్గింది. ఇప్పుడు అదే తరహాలో తిరుపతి విషయంలో కూడా జనసేనకు సర్ది చెప్పాలని బీజేపీ నేతలు భావిస్తున్నారు.